Chennai: సముద్రపు నీరు రంగు మారిందోచ్...
ABN, Publish Date - Jul 04 , 2024 | 01:33 PM
ఉత్తర చెన్నై(North Chennai) పరిధిలోని ఎన్నూర్ ప్రాంతంలోని సముద్రపు నీరు బుధవారం పసుపు రంగుకు మారడంతో జాలర్లు ఆందోళనకు గురయ్యారు. ఎన్నూర్‌లో రాష్ట్రప్రభుత్వ నిర్వహణలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రం(Thermal Power Station) సమీపంలో ఉన్న సముద్రంలో జాలర్లు చేపలు పడుతుంటారు.
చెన్నై: ఉత్తర చెన్నై(North Chennai) పరిధిలోని ఎన్నూర్ ప్రాంతంలోని సముద్రపు నీరు బుధవారం పసుపు రంగుకు మారడంతో జాలర్లు ఆందోళనకు గురయ్యారు. ఎన్నూర్‌లో రాష్ట్రప్రభుత్వ నిర్వహణలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రం(Thermal Power Station) సమీపంలో ఉన్న సముద్రంలో జాలర్లు చేపలు పడుతుంటారు. సంఘటన రోజు ఉదయాన్నే వేటకు వెళ్లిన జాలర్లు, ఎన్నూర్(Ennur) ముఖద్వారంలోని సముద్రపు నీరు పసుపు రంగులోకి మారడం గుర్తించి భయాందోళనకు గురై చేపలు పట్టకుండా తీరానికి తిరిగొచ్చారు.
ఇదికూడా చదవండి: Chennai: రౌడీ రాజా దారుణహత్య..
దీనిపై స్థానికులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ఇసుక రేణువులు అధికంగా ఒకే ప్రాంతంలో చేరే సమయంలో సముద్రపు నీరు రంగు మారడం సహజమేనని అధికారులు వివరణ ఇచ్చారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 04 , 2024 | 01:33 PM