ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: డొనాల్డ్ ట్రంప్‌పై దాడి.. సీన్ రీ క్రియేట్ చేసిన ఉగాండ చిన్నారులు

ABN, Publish Date - Jul 19 , 2024 | 02:23 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)పై ఇటీవల ఓ దుండగుడు తుపాకితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొంత సేపటికే చైనాలో ట్రంప్‌కి సంబంధించిన టీ షర్ట్‌లు మార్కెట్లో అమ్మకానికి సిద్ధం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)పై ఇటీవల ఓ దుండగుడు తుపాకితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొంత సేపటికే చైనాలో ట్రంప్‌కి సంబంధించిన టీ షర్ట్‌లు మార్కెట్లో అమ్మకానికి సిద్ధం చేశారు.

అయితే తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన ఘటనను ఉగాండా చిన్నారులు రీక్రియేట్ చేసి టిక్ టాక్‌లో పెట్టారు. వీడియోలో.. ఓ చిన్నారి స్టేజిపై ట్రంప్‌లా మాట్లాడుతుండగా.. చుట్టూ కర్ర తుపాకులతో ట్రంప్‌నకు సెక్యూరిటీగా నలుగురు భద్రతా సిబ్బంది(చిన్నారులు) నిల్చున్నారు.


ఇంతలో బుల్లెట్ సౌండ్ వినిపించగా.. చెవి పట్టుకుని ట్రంప్, ఆయనను చూసి భద్రతా సిబ్బంది స్టేజీ పైనే కూర్చుండిపోతారు. ఆపై ట్రంప్ ‘ఫైట్ ఫైట్’ అంటూ నినదిస్తుండగా.. భద్రత కల్పిస్తున్న పిల్లలు ఆయనను పట్టుకుని కిందకి తీసుకెళతారు.

అచ్చంగా డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాన్ని ఉగాండా పిల్లలు చేసి చూపించారు. ఈ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీంతో ఓ నెటిజన్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశాడు. అయితే నెటిజన్లు కొందరు చిన్నారులను మెచ్చుకుంటుండగా.. మరికొందరు ఇలాంటి సున్నిత‌మైన అంశాల‌పై వీడియో తీయ‌డం ప‌ట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

For Latest News and National News click here

Updated Date - Jul 19 , 2024 | 02:24 PM

Advertising
Advertising
<