ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..

ABN, Publish Date - Oct 03 , 2024 | 06:59 AM

భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి ముందే ఆమెను కోర్టు హాల్‌లో భుజాన ఎత్తుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. చివరకు భార్య కూడా వెనక్కు తగ్గడంతో కోర్టు ఈ కేసును పక్కనపెట్టేసింది. చైనాలో వెలుగు చూసిన ఈ ఉదంతంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: అది కోర్టు.. ఎదురుగా జడ్జి.. ఓ డైవర్స్ పిటిషన్‌పై విచారణ సాగుతోంది. ఓ వివాహిత ఈ పిటిషన్ వేయగా విచారణకు భర్త కూడా హాజరయ్యాడు. నాకు విడాకులు కావాల్సిందేనంటూ భార్య భీష్మించుకుని కూర్చుంది. ఆమె ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో జడ్జి కూడా ఆమె వైపే మొగ్గు చూపే పరిస్థితులు నెలకొన్నాయి. తనకు డైవర్స్ తప్పదన్న భయం ఆ భర్తకు మొదలైంది. చివరకు అతడు విచక్షణ మరిచి జడ్జి ముందే ఊహించని పని చేశాడు. అతడి తీరుకు కోర్టులోని వారందరూ అవాక్కయ్యారు. చైనాలో తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం (Viral) పూర్తి వివరాల్లోకి వెళితే..


Viral: వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా?

లీ, చెన్ దంపతులకు పెళ్లై 20 ఏళ్లు అయ్యింది. సిచువాన్ ప్రావిన్స్‌లో ఉండే వారికి ముగ్గురు సంతానం. కానీ మద్యానికి బానిసైన లీ తరచూ మద్యం మత్తులో భార్యను వేధిస్తుండేవాడు. అతడితో విసిగిపోయిన చెన్ చివరకు విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు మాత్రం తొలుత ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇద్దరు మళ్లీ కలిసిపోయేందుకు మరో అవకాశం ఇస్తున్నట్టు తీర్పు వెలువరించింది. కానీ చెన్ మాత్రం లీతో కలిసి ఉండేదే లేదని తేల్చి చెప్పింది. తనకు విడాకులు కావాల్సిందేనంటూ మరో పిటిషన్ వేసింది. చివరకు కోర్టు కూడా ఆమెకు విడాకులు ఇప్పించేందుకు సిద్ధమైంది.


UP: క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్ ఆర్డర్! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక..

ఈ క్రమంలో కోర్టులోనే ఉన్న లీ తనకు విడాకులు తప్పవనుకున్నాడు. చివరకు విచక్షణ మరిచి భార్యను అమాంతం ఎత్తి భుజాన వేసుకుని కోర్టులోంచి బయటకు పరిగెత్తాడు. ఈ సీన్ చూసి జడ్జి కూడా క్షణకాలం పాటు షాకైపోయారు. అయితే, అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు లీని నిలువరించి అతడి భార్యను కాపాడారు. చివరకు లీ లిఖితపూర్వకంగా కోర్టుకు క్షమాపణ చెప్పాడు. తనకు విడాకులు తప్పవన్న భయంతోనే ఇలా చేశానని లేఖ రాశాడు. తను చేసింది ఎంత తీవ్రమైన తప్పో, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకున్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ఇలాంటి పని ఎన్నడూ చేయనని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో అతడి భార్య కూడా విడాకుల విషయంలో వెనక్కు తగ్గడంతో కోర్టు వారి కేసును పక్కన పెట్టేసింది.


Viral: అచేతనంగా పుట్టిన శిశువును ఈ డాక్టర్ ఎలా బతికించారో చూస్తే..

కాగా, ఈ ఘటనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. కోర్టు తీర్పును అనేక మంది తప్పుబట్టారు. జడ్జి ముందే లీ ఇలా బరితెగించాడంటే తన ఇంట్లో అతడు చేసే దారుణాలకు అంతు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. గృహ హింస, అందుకు సంబంధించిన చట్టాలపై కోర్టుకు అవగాహన లేదని కూడా కొందరు వ్యాఖ్యానించారు. అయితే, చైనాలో మహిళల్లో చాలా మంది గృహ హింస బాధితులుగా ఉన్నారని అక్కడి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. వివాహితల్లో 30 శాతం తాము గృహ హింస ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఇక స్త్రీల ఆత్మహత్యలకు సంబంధించి ఏకంగా 60 శాతం కేసుల్లో కారణం గృహ హింసేనని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Viral: కుందేలు, తాబేలు మధ్య పరుగు పదెం.. చివరికి ఏమైందో చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Oct 03 , 2024 | 07:07 AM