ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: చైనాలో పేలిన మురుగునీటి పైపు! జనాల ఒళ్లంతా మానవవ్యర్థాలు పడి..

ABN, Publish Date - Sep 28 , 2024 | 04:13 PM

చైనాలో ఓ సివరేజీ పైపు లైన్ పేలడంతో మురుగు నీరు 33 అడుగుల ఎత్తు వరకూ ఎగసి పడింది. అక్కడున్న వారందరూ మానవ వ్యర్థాలు, మురుగు మీద పడి తడిసి ముద్దయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. జనాలు షాకైపోయేలా చేస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: వానాకాలం వచ్చిందంటే చాలు.. నాలాలు పొంగిపొర్లు తుంటాయి. రోడ్డంతా మురుగుతో నిండిపోయి దుర్గంధ భూయిష్టంగా మారుతుంటుంది. మనలో చాలా మంది ఇది చూసే ఉంటారు. అయితే, చైనాలో ఇంతకంటే దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మురుగు నీరు పైపు అకస్మాత్తుగా పేలిపోవడంతో ఉవ్వెత్తున ఎగసిపడ్డ మానవ వ్యర్థాలు అక్కడున్న వారందరి మీద వర్షంలా కురిశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి.

Viral: పాప్యులర్ ఇన్‌ఫ్లుయెన్స్‌ర్‌కు యువతి షాక్! ఫోటో దిగుదామని చెప్పి..

చైనాలోని నాన్నింగ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగిందట. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ ప్రాంతంలో కొత్తగా ఓ సివరేజీ పైపు వేశారు. ఈ క్రమంలో నిర్మాణ సిబ్బందిపై పైపులో పీడనం ఎంత ఉందో తెలుసుకునేందుకు పరీక్షలు ప్రారంభించగా పైపు హఠాత్తుగా పేలిపోయింది. ఒక్కసారిగా పైపు పేలిపోవడంతో మురుగు నీరు, మానవవ్యర్థాలు ఏకంగా 33 అడుగుల వరకూ ఉవ్వెత్తున ఎగసాయి. అక్కడే ఉన్న పాదచారులు, వాహనదారుల మీద పడటంతో వారంతా మురుగులో తడిసి ముద్దైపోయారు. పరుగుపరుగున అక్కడి నుంచి బయటపడ్డారు.

Viral: ఆఫీసులో అలసిపోయి వచ్చిన భార్య కోసం వంట వండని భర్త! చివరకు..


మురుగు నీరు చొరబడి పలు వాహనాలు దుర్గంధ భూయిష్టంగా మారిపోయాయి. ‘‘నా కారు మొత్తం మురుగులో తడిసి పసుపు పచ్చగా మారిపోయింది. కంపు కొడుతోంది. మళ్లీ ఉపయోగించలేని విధంగా నాశనమైంది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు (China pipe blast shoots poop 33 feet into air drenches commuters). అటువైపుగా ప్రయాణిస్తున్న ఓ కారులో డ్యాష్ క్యామ్‌లో ఈ దృశ్యాలన్నీ రికార్డ నెట్టింట కాలు పెట్టాయి. పైపు పేలుడు చూసి అనేక మంది షాకైపోయారు.

Viral: వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

ఇంత భారీ స్థాయిలో పైపు పేలినా అదృష్టవశాత్తూ అక్కడి వారెవరకీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, కొన్ని వాహనాలు మాత్రం ధ్వంసమయ్యాయట. ఘటనపై అక్కడి అధికారులు స్పందించారు. నిర్మాణ పనుల్లో ఈ పేలుడు సంభవించలేదని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, మురుగుతో నిండిపోయిన పరిసరాలను శుభ్రం చేసేందుకు రంగంలోకి దిగారు. కానీ పరిస్థితి చక్కదిద్దడం వారిని తలకు మించిన భారంగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Viral: షాకింగ్..నవజాత శిశువుతో పాలసీసా శుభ్రం చేయించిన వైనం!


ఇక ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. తాము ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదని అనేక మంది కామెంట్ చేశారు. ఆ చెత్తనంతా శుభ్రపరరచడం సామాన్యం విషయం కాదని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో నెట్టింట సంచలనం రేపుతోంది. మరోవైపు, చైనాలో తాజాగా అణుజలాంతర్గామి కూడా జలసమాధి కావడం నెట్టింట చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

Read Latest and Viral News

Updated Date - Sep 28 , 2024 | 05:47 PM