ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: దేవుడా! పంది మేతను తింటున్న యువతి! ఎందుకని అడిగితే..

ABN, Publish Date - Nov 08 , 2024 | 09:59 PM

పొదుపు పేరిట ఓ చైనా యువతి చేస్తున్న అతి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదేం మాయరోగం అంటూ జనాలు తిట్టిపోసేలా చేస్తోంది. పందులకు వేసే మేతను ఆమె తినడం చూసి జనాలు నమ్మలేక నోరెళ్లబెడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: రెండు చేతులా డబ్బు సంపాదించడమే కాదు.. దుబారా ఖర్చులు కట్టిపెట్టి డబ్బును పొదుపు చేయడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే లైఫ్‌లో ఆర్థికస్థిరత్వం, భవిష్యత్తుకు భద్రత లభిస్తాయి. కానీ పొదుపు పేరిట ఓ చైనా యువతి చేస్తున్న అతి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదేం మాయరోగం అంటూ జనాలు తిట్టిపోసేలా చేస్తోంది. చివరకు ఈ యువతి గురించి చైనా ప్రధాన మీడియాలో కూడా పలు కథనాలు వెలువడ్డాయి (Viral).

Viral: పెళ్లికి 14 రోజులుందనగా బాయ్‌ఫ్రెండ్ సీక్రెట్ గురించి తెలిసి..


స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ యువతి పేరు కాంగ్ యూఫెంగ్. ఆమె అక్కడ బాగా పాప్యులారిటీ సాధించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అక్కడి వారు యువతిని కింగ్ కాంగ్ ల్యూకీ అని పిలుస్తుంటారు. అయితే, ఇటీవల ఆమె ఏకంగా పందులకు వేసే మేతను తినడం మొదలెట్టింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసింది. ఎందుకిలా అని అభిమానులు ప్రశ్నిస్తే.. డబ్బు పొదుపు చేసేందుకని ఆమె ఠక్కున చెప్పడంతో నెట్టింట ఒక్కసారిగా కలకలం మొదలైంది.

వాస్తవానికి యూఫెంగ్ విద్యావంతురాలు. సిచువాన్ ఫైన్ ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఇంత చదవి, ఇంతటి అనుభవం ఉండి కూడా ఆమె పందికి వేసే మేత తినడం జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, యూఫెంగ్ తన తీరును గట్టిగానే సమర్థించుకుంటోంది.

Viral: లీవ్ ఇవ్వని బాస్.. వీడియో కాల్‌‌‌లో పెళ్లి చేసుకున్న యువకుడు


వీలైనంత తక్కువగా డబ్బులు ఖర్చులు చేస్తూ బతకడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చింది. ఈ దిశగా పంది మేత తినడం మొదలెట్టినట్టు వివరించింది. తాను సాధారణంగా ఖరీదు పెట్టి కొనుక్కుని తినే ఫాస్ట్ ఫుడ్ కంటే పంది మేతే మేలని కూడా గర్వంగా చెప్పుకుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది. అయితే, డబ్బును మరీ ఇంతలా పొదుపు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో మాత్రం ఆమె వివరించలేదు. అయితే, తాను 14 డాలర్లు పెట్టి పందిమేత కొన్నట్టు ఆమె వివరించింది. దీని వాసన ఓట్ మీల్ లాగా ఉందని కూడా చెప్పుకొచ్చింది. సోయా బీన్స్, పల్లీలు, నువ్వులు, మొక్కజొన్న, ఇతర విటమిన్లతో దీన్ని చేస్తారని వివరించింది.

ఇక యూఫెంగ్ తీరుతో ఆమె అభిమానుల్లో అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనుషులు తినేందుకు పనికిరాని ఆహారాన్ని తింటే పోషకాహార లేమి బారినపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, ప్రాణాంతక ఇన్ఫేక్షన్లు సోకొచ్చని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

Read Latest and Viral News

Updated Date - Nov 08 , 2024 | 10:04 PM