ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఆఫీసులో కునుకు తీసినందుకు ఊస్టింగ్.. బాధితుడికి రూ.41.6 లక్షల పరిహారం!

ABN, Publish Date - Nov 24 , 2024 | 06:39 PM

ఇరవై ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్న తనను చిన్న కునుకు తీసినందుకు తొలగించారని మండిపడ్డాడో వ్యక్తి. న్యాయపోరాటం ప్రారంభించిన అతడు సంస్థ యాజమాన్యాన్ని కోర్టుకు ఈడ్చిన రూ.41.6 లక్షల పరిహారం దక్కించుకున్నాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఇరవై ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్న తనను చిన్న కునుకు తీసినందుకు తొలగించారని మండిపడ్డాడో వ్యక్తి. న్యాయపోరాటం ప్రారంభించిన అతడు సంస్థ యాజమాన్యాన్ని కోర్టుకు ఈడ్చి రూ.41.6 లక్షల పరిహారం దక్కించుకున్నాడు. చైనాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా వైరల్ అవుతోంది (viral).

జియాంగ్సూ ప్రావిన్స్‌లోని ఓ రసాయనాల సంస్థలో జాంగ్ అనే వ్యక్తి మేనేజర్‌గా చేస్తున్నాడు. గత 20 ఏళ్లుగా అదే సంస్థలో ఉంటూ అంచలంచెలుగా ఎదిగి మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు. కొన్నాళ్ల క్రితం కార్యాలయంలో అతడు డ్యూటీ సమయం దాటాక కూడా ఉండిపోయి విధులు నిర్వర్తించాడు. ఆ తరువాత అలసటతో చిన్న కునుకు తీశాడు. తన డెస్క్ మీద తలవాల్చి నిద్రపోతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కాడు.

Viral: ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు! స్విగ్గీలో కండోమ్స్‌కు ఆర్డర్ పెడితే..


ఇది జరిగిన రెండు వారాల తరువాత సంస్థలోని మానవ వనరుల విభాగం అతడిపై నివేదిక విడుదల చేసింది. పని ప్రదేశంలో అతడు అలసిపోయి నిద్రిస్తూ కనిపించాడని పేర్కొంది. ఆ తరువాత అతడికి ఆన్‌లైన్ కాల్‌ చేసిన హెచ్‌ఆర్ ఉద్యోగి ఎంత సేపు నిద్రించావని అడగ్గా..సుమారు గంట పాటు కునుకు తీసినట్టు జాంగ్ నిజాయతీగా చెప్పుకొచ్చాడు.

ఆ తరువాత సంస్థ యాజమాన్యం కార్మిక యూనియన్‌తో చర్చించాక అతడిని డిస్మిస్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. పని ప్రదేశంలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు అతడిని తొలగిస్తున్నట్టు నోటీసుల్లో పేర్కొంది. ఉద్యోగుల్లో క్రమశిక్షణ లేకపోవడాన్ని తాము అస్సలు క్షమించమని తేల్చి చెప్పింది.

Viral: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తపై భార్య వింత రివెంజ్.. షాకింగ్ వీడియో!


‘‘కామ్రేడ్ జాంగ్.. మీరు సంస్థలో 2004లో చేరారు. ఆ సమయంలో ఓపెన్ ఎండెడ్ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్‌పై కూడా సంతకం చేశారు. ఇక పని ప్రదేశంలో నిద్రిస్తూ దొరికిపోవడం కంపెనీ నిబంధనల ప్రకారం తీవ్ర ఉల్లంఘన కిందకు వస్తుంది. క్రమశిక్షణ రాహిత్యాన్ని మేము అస్సలు సహించం. కాబట్టి, యూనియన్ అనుమతితో మిమ్మల్ని తక్షణం విధుల నుంచి తొలగిస్తున్నాము. మీకు సంస్థకు మధ్య ఇకపై ఎటువంటి కార్మిక-యాజమాన్య సంబంధాలు ఉండవు’’ అని నోటీసులో పేర్కొంది.

అయితే, సంస్థ తనను తొలగించడం తీవ్ర అన్యాయమని భావించిన జాంగ్ కోర్టును ఆశ్రయించారు. జరిగింది పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. న్యాయమూర్తి కూడా బాధితుడి వాదనతో ఏకీభవించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులను తొలగించే హక్కు సంస్థలకు ఉన్నప్పటికీ సంబంధిత ఉద్యోగి చర్య కారణంగా తీవ్ర నష్టం జరిగినట్టు సంస్థ యాజమాన్యాలు నిరూపించాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘‘అతడు తన 20 ఏళ్ల కెరీర్‌లో మొదటిసారి అలా నిద్రించాడు. ఆ తప్పు వల్ల సంస్థకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు’’ అని అన్నారు. చివరకు జాంగ్ తొలగింపు అన్యాయమేనన్న జడ్జి బాధితుడికి సంస్థ రూ.41.6 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించారు.

Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..

Read Latest and Viral News

Updated Date - Nov 24 , 2024 | 08:23 PM