ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఆన్‌లైన్ డేటింగా? జాగ్రత్త.. ఇలాంటోళ్లు తారసపడితే కొంప కొల్లేరే!

ABN, Publish Date - Nov 11 , 2024 | 09:50 PM

తోడు కోసం వారు పడే ఆరాటాన్ని ఆసరా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త ట్రిక్స్‌తో డబ్బు దోచుకుంటున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా చైనాలో వెలుగు చూసిన ఈ ఓ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో అనేక మంది తోడు కోసం ఆన్‌లైన్‌లో వెతుక్కుంటున్నారు. ఇది కొందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. తోడు కోసం వారు పడే ఆరాటాన్ని ఆసరా చేసుకుని మోసగాళ్లు కొత్త కొత్త ట్రిక్స్‌తో డబ్బు దోచుకుంటున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా చైనాలో వెలుగు చూసిన ఈ ఓ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..

స్థానిక మీడియా కథనాల ప్రకారం, టియాంజిన్ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్‌‌కు ఆన్‌లైన్‌లో ఓ లీ అనే మహిళ పరిచయమైంది. తోడు కోసం వెతుక్కుంటున్న అతడికి లీ తనని తాను ఓ మహిళా వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుంది. కుటుంబ వారసత్వంగా తనకు అనేక వ్యాపారాలు సంక్రమించాయని చెప్పుకొచ్చింది. తనకు భర్త పోయారని, ఆ బాధ నుంచి ఇటీవలే కోలుకున్న తను మళ్లీ వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్టు చెప్పింది. లీ తీరు నచ్చడంతో వాంగ్ ఆమె ప్రేమలో పడిపోయాడు. వాంగ్‌ తన ఉచ్చులో పడ్డాడని భావించాక లీ తన పథకాన్ని అమలు చేసింది.

Viral: తాత పుట్టిన రోజున ఒంటరిగా బామ్మ.. మనవడి ఊహించని సర్‌ప్రైజ్!


గతించిన తన భర్త ఆత్మతాలూకు ప్రభావం కొత్త జీవితంపై ఏమాత్రం ఉండకుండా చేసేందుకు ఓ క్రతువు నిర్వహించాలని వాంగ్‌కు చెప్పింది. ఇందులో భాగంగా తన బెడ్‌రూంలోని మంచాన్ని, పరుపును మంత్రాల ఉచ్చరిస్తూ తగలబెట్టాలని చెప్పుకొచ్చింది. ఈ క్రతువు నిర్వహించేందుకు భారీగా డబ్బు కూడా ఖర్చవుతుందని చెప్పింది. ఈ తతంగం పూర్తయితే తమ పెళ్లికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయని చెప్పింది. తమ కుటుంబంలో, గ్రామంలో తరతరాలుగా పాటిస్తున్న ఆచారమని నమ్మించింది. ఇదంతా నమ్మిన వాంగ్ ఆమెకు ఏకంగా రూ.11 లక్షలు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు.

Viral: ఈ స్లిప్పర్స్ చలికాలం కోసమట.. ఏం క్రియేటివిటీరా బాబూ..


డబ్బు తీసుకున్నాక లీ.. తగలబెట్టిన పరుపు, మంచం తాలూకు ఫొటోలను పంపింది. ఆ తరువాత అకస్మాత్తుగా అతడితో అన్ని సంబంధాలు తెంచేసుకుంది. సోషల్ మీడియా మొదలు, ఈమెయిల్స్ వరకూ ఏ విధంగానూ వాంగ్ తనను సంప్రదించేందుకు వీలులేకుండా బ్లాక్ చేసింది. అసలేం జరిగిందో అర్థంకాక తొలుత దిమ్మెరపోయిన వాంగ్ ఆ తరువాత జరిగిన మోసం తెలిసి లబోదిబో మన్నాడు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కాగా, ఆన్‌లైన్‌ ప్రేమలతో కలిగే ఉపద్రవాలను కళ్లకుకట్టినట్టు చూపించిన ఈ ఉదంతం చైనాలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వాళ్లు తారసపడితే జీవితాలు నాశనమవుతాయంటూ అనేక ఆందోళన వ్యక్తం చేశారు.

Read Latest and Viral News

Updated Date - Nov 11 , 2024 | 09:51 PM