ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దారుణం.. అందమైన యువతి మనసులో ఇంతటి క్రూరత్వమా! వైరల్ వీడియో!

ABN, Publish Date - Jun 15 , 2024 | 08:57 PM

బతికున్న పామును కసిగా కొరుక్కు తిన్న యువతి వీడియో నెట్టింట వైరల్ మారింది. ఈ వీడియో చూస్తే విరక్తి పుడుతోందని అనేక మంది కామెంట్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: పాములంటే అందరికీ భయమే. అయితే, చైనా నుంచి వియత్నాం వరకూ అనేక దేశాల్లో పాములను వండుకుని తింటారు. కానీ, ఇంతకంటే జుగుప్సాకరమైన వీడియో నెట్టింట వైరల్ గా (Viral) మారింది.

వీడియోలో ఓ యువతి ఏకంగా బతికున్న పామునే కొరుక్కుని తినేసింది. యువతి ముందు ప్లేట్‌లో బోలెడన్ని పాములు ఉన్నాయి. అందులో ఓదాన్ని చేతిలోకి తీసుకున్న యువతి దాన్ని బతికుండగానే కొద్ది కొద్దిగా కొరికి తిన్నది. ఒసారి పాము మధ్యలో మరోసారి తలదగ్గర కొరికి తిన్నది. బతికున్న జీవిని అంత కిరాతకంగా తింటున్నా యువతి ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. ఇది ఎంతో సాధారణమైన విషయం అన్నట్టు ఆమె పామును తిన్నది (Clip Of A South Korean Girl Eating Snake Alive goes viral).

Viral: వామ్మో.. ఏసీ పేలితే ఇంతటి విధ్వంసమా!


వింత వింత ఆహారాలకు సంబంధించి దక్షిణ కొరియాలో ఓ పాప్యులర్ టీవీ షో ప్రసారమవుతుందట. ఈ వీడియో ఆ షోలోనిదే అని కొందరు నెటిజన్లు చెప్పారు.

నెట్టింట ప్రస్తుతం ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇంతటి దారుణమైన వీడియో ఇప్పటివరకూ చూడలేదని వేల మంది కామెంట్ చేశారు. మనుషుల మీదే విరక్తి పుట్టేలా ఈ వీడియో ఉందని కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాముకు ఎంతటి నరకం కనిపించి ఉంటుందో అని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ చేపలు, చికెనుకు కొరత ఏర్పడి చివరకు ఇలాంటి వాటి మీదపడ్డారేమో అని మరికొందరు సెటైర్లు విసిరారు. అందమైన యువతి మనసులో ఇంతటి క్రూరత్వమా? అని కొందరు ఆశ్చర్యపోయారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. జనాలను గగ్గోలు పెట్టిస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Viral and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 09:01 PM

Advertising
Advertising