ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: బెడ్‌షీట్‌పై కాఫీ చుక్కలు.. కస్టమర్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన హోటల్ సిబ్బంది..

ABN, Publish Date - Dec 28 , 2024 | 03:04 PM

స్టార్ హోటల్స్‌లో ఏ మాత్రం చిన్న తేడా జరిగినా భారీ జరిమానాలు చెల్లించాల్సిందే. లేకపోతే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా ముంబైలో ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. తనకెదురైన అనుభవాన్ని ఆ వ్యక్తి రెడ్డిట్ ద్వారా సోషల్ మీడియలో పంచుకున్నాడు.

coffee stains appeared on bedsheet

సాధారణంగా స్టార్ హోటల్స్‌లో (Star Hotel) ఎంతో శుభ్రతను పాటిస్తారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తారు. అయితే ఏ మాత్రం చిన్న తేడా జరిగినా భారీ జరిమానాలు చెల్లించాల్సిందే. లేకపోతే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా ముంబై (Mumbai)లో ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. తనకెదురైన అనుభవాన్ని ఆ వ్యక్తి రెడ్డిట్ ద్వారా సోషల్ మీడియలో పంచుకున్నాడు. ఆ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. @EnlightendSatan అనే యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నాడు (Viral News).


ఆ వ్యక్తి ముంబైలోని ఓ 4 స్టార్ హోటల్‌కు వెళ్లాడు. అతడు బస చేసిన గదిలో కాఫీ (Coffee) తాగుతుండగా కొన్ని చుక్కలు లెనిన్ బెడ్ షీట్ (Bedsheet), తలగడపై పడ్డాయి. అది చూసిన హోటల్ సిబ్బంది అతడికి రూ.2500 ప్లస్ ట్యాక్సు‌లను జరిమానాగా విధించారు. దీంతో అతడు షాకయ్యాడు. హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. చాలా కొన్ని చుక్కలేనని, దానికి అంత ఫైన్ ఎందుకని హోటల్ సిబ్బందితో వాదించాడు. హోటల్ సిబ్బంది మాత్రం జరిమానా కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో తనకెదురైన ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ వీడియో వైరల్ కావడంతో చాలా మంది తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు.


``మంచి హోటల్స్ అలాంటి వాటిని పట్టించుకోవు. వారికి బెడ్‌షీట్‌లు మరియు కుషన్ కవర్‌ల కంటే కస్టమర్ ముఖ్యం``, ``నాప్కిన్ చెడిపోయినందుకు నాకు హోటల్‌లో జరిమానా విధించారు``, ``నేను గతంలో తాజ్ హోటల్‌లో బస చేశాను. అప్పుడు బెడ్‌షీట్పై టీ పడిపోయింది. ఆ సిబ్బంది నన్ను డబ్బులు అడగలేదు. పైగా నేను అడిగినప్పుడు వారు దానిని మార్చి మరొకటి తెచ్చారు``, ``కాఫీ మరక పడినందుకు కొత్త బెట్‌షీట్ కొనివ్వాలేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: గుడ్ల గూబల మధ్యన పిల్లి.. మీ కళ్లు పవర్‌ఫుల్ అయితేనే 10 సెకెన్లలో పట్టుకోగలరు..


Viral News: ఉల్లిపాయ అడిగిన డెలివరీ బాయ్.. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే..


Viral Video: ఈ అమ్మాయికి ఏమైంది? బిజీ రోడ్డు మీద బైక్ అలా నడుపుతోందేంటి.. వీడియో వైరల్..


Viral Video: ఇది ఆల్టో కాదు.. మినీ థార్.. ఓ వ్యక్తి ఇంజినీరింగ్ ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 28 , 2024 | 03:04 PM