ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Conquered sleep: నిద్రను జయించాడు...

ABN, Publish Date - Sep 15 , 2024 | 10:51 AM

రెండ్రోజులు వరుసగా కేవలం గంట నిద్ర తగ్గితేనే నిస్సత్తువగా ఉంటుంది. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం రోజుకు కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నాడంటే ముక్కున వేలేసుకుంటారు ఎవరైనా. అలాగని ఒకటి, రెండు కాదు... గత పన్నెండేళ్లుగా ఇదే పద్ధతిని అనుసరిస్తూ, పైగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు 40 ఏళ్ల డైసుకే హోరి.

Viral News: రెండ్రోజులు వరుసగా కేవలం గంట నిద్ర తగ్గితేనే నిస్సత్తువగా ఉంటుంది. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం రోజుకు కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నాడంటే ముక్కున వేలేసుకుంటారు ఎవరైనా. అలాగని ఒకటి, రెండు కాదు... గత పన్నెండేళ్లుగా ఇదే పద్ధతిని అనుసరిస్తూ, పైగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు 40 ఏళ్ల డైసుకే హోరి. తన జీవితకాలాన్ని రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతో నిద్రను ప్రతి రోజూ అరగంటకు పరిమితం చేసుకున్నాడట. 30 నిమిషాల పాటు నాణ్యమైన నిద్రతో కావాల్సిన విశ్రాంతిని పొందేలా... శరీరాన్ని, మెదడును పూర్తిగా ట్రైన్‌ చేసుకున్నాడు. దానికోసం పెద్ద సాధనే చేశాడు. నిద్ర సమయాన్ని ఎనిమిది గంటల నుంచి కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ చివరికి అరగంటకు తెచ్చాడట.


ప్రతీ రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయడం, ఆటలు ఆడటం, తినడానికి గంట ముందు కాఫీ తాగడం వంటి... అలవాట్లతో నిద్రమత్తును నెమ్మదిగా దూరం చేసుకోవచ్చని చెబుతున్నాడు. తాను చెప్పేవన్నీ నిజాలని ఓ జపాన్‌ రియాల్టీ షోలో నిరూపించాడు కూడా. ఆ షోలో హోరీ రోజుకు కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు. 2016లో ‘షార్ట్‌ స్లీపర్స్‌ ట్రైనింగ్‌ అసోషియేషన్‌’ స్థాపించి నిద్రకు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పటిదాకా 2100 మందిని ఆలా్ట్ర షార్ట్‌ స్లీపర్లుగా మార్చాడు. ‘జీవితంలో చాలా సమయం నిద్రకే వృథా అవుతోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అవసరం’ అంటాడు హోరి.

Updated Date - Sep 15 , 2024 | 11:50 AM

Advertising
Advertising