ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: లీవ్ ఇవ్వని బాస్.. వీడియో కాల్‌‌‌లో పెళ్లి చేసుకున్న యువకుడు

ABN, Publish Date - Nov 07 , 2024 | 08:39 PM

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడికి సెలవు దొరక్కపోవడంతో చివరకు ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడికి సెలవు దొరక్కపోవడంతో చివరకు ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌‌గా (Viral) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: స్కూల్లో జరిగేదేంటో తెలుసుకునేందుకు కూతురి ఆటబొమ్మలో సీక్రెట్ కెమెరా


బిలాస్‌పూర్‌కు చెందిన అద్నన్ ముహమ్మద్ తుర్కియేలో ఉద్యోగం చేస్తుంటాడు. ఇటీవల అతడికి మండీకి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే వధువు తాత ఆమె పెళ్లి చూడాలని ఎంతగానో ఆశపడుతున్నారు. ఈ క్రమంలో ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకునేందుకు వరుడు నిశ్చయించుకున్నాడు. కానీ, తన కంపెనీలో సెలవుకు దరఖాస్తు చేసుకుంటే బాస్ లీవ్ ఇచ్చేలేదని తేల్చి చెప్పాడు.

దీంతో, ఏం చేయాలో పాలుపోని వరుడు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు. వారు వధువు కుటుంబంతో సమాలోచనలు జరిపారు. అయితే, వీలైనంత త్వరగా తన మనవరాలి పెళ్లి చూడాలని వధువు తాత పట్టుబట్టడంతో చివరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పెళ్లి జరిపించేందుకు వధూవరుల కుటుంబాలు నిర్ణయించాయి.

USA: షాకింగ్.. గర్ల్‌ఫ్రెండ్ హెయిర్ స్టైల్ నచ్చక కత్తితో పొడిచి హత్య!

ఆదివారం అద్నన్ కుటుంబసభ్యులు బిలాస్‌పూర్ నుంచి ఊరేగింపుగా మండీలోని వధువు ఇంటికి వచ్చారు. వరుడు లేకపోయినా సరే సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా వచ్చారు. ఆ తరువాత సోమవారం వీడియో కాల్ ద్వారా వధూవరులు ఖాజీ సమక్షంలో వివాహబంధంలో ఒక్కటయ్యారు.


కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు వెలుగు చూశాయి. గతేడాది వరదల కారణంగా మార్గం మూసుకుపోవడంతో ఓ జంట ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

మరో ఘటనలో ఒక్క రోజు సెలవు కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపించాలని బాస్ ఒత్తిడి చేసినందుకు ఓ వ్యక్తి వెంటనే రాజీనామా చేశాడు. తన వద్ద డబ్బుల్లేక సొంత వైద్యం చేసుకుని వద్దామనుకుంటే ఇలా డాక్టర్ చిట్టీ కోసం ఒత్తిడి చేయడం భావ్యం కాదని అతడు వాపోయాడు. డాక్టర్ ఖర్చులు కంపెనీ ఇన్సూరెన్స్‌ భరిస్తుందా అని ప్రశ్నించాడు. చిన్న జ్వరం వచ్చినందుకు సెలవు అవసరమా అని బాస్ అడగడం కూడా తనకు నచ్చలేదని చెప్పుకొచ్చాడు. దీంతో, తనకు చిరాకొచ్చి అప్పటికప్పుడు రిజైన్ చేస్తున్నట్టు మెసేజ్ పెట్టానని వివరించాడు. అప్పట్లో ఈ ఉదంతం వైరల్‌ కాగా అనేక మంది ఉద్యోగి నిర్ణయం సరైనదేనని సమర్థించారు. ఇటీవల కాలంలో అనేక కార్యాలయాల్లో విషపూరిత పని సంస్కృతి పెరిగిపోతోందని విచారం వ్యక్తం చేశారు.

Read Latest and Health News

Updated Date - Nov 07 , 2024 | 09:17 PM