ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: పబ్లిక్‌గా జంట అధర చుంబనాలు.. మెట్రో స్టేషన్‌లో షాకింగ్ సీన్!

ABN, Publish Date - Dec 17 , 2024 | 07:34 PM

ఓ జంట మెట్రో స్టేషన్‌లో గాఢ చుంబనాల్లో మునిగిపోయిన తీరు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కోల్‌కతా మెట్రోస్టేషన్‌లో వెలుగు చూసిన ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఓ జంట మెట్రో స్టేషన్‌లో గాఢ చుంబనాల్లో మునిగిపోయిన తీరు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కోల్‌కతా మెట్రోస్టేషన్‌లో వెలుగు చూసిన ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆ జంట తప్పు చేయట్లేదని కొందరంటే బహిరంగ ప్రదేశాల్లో ఇలా అసభ్యకరంగా వ్యవహరించొచ్చా అని కొందరు ప్రశ్నిస్తున్నారు (Viral).

Viral: ఈ ఏనుగుకు ఎంత మర్యాద! తన దారికి అడ్డుగా నిలబడ్డ వ్యక్తిని..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ జంట అధర చుంబనాల్లో లోకాన్నే మర్చిపోయింది. స్టేషన్‌లో పట్టపగలు వారు బహిరంగ ప్రేమ ప్రదర్శనకు పూనుకోవడంతో స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అటువైపుగా వచ్చి వెళుతున్న వారందరూ ఆ జంటను చూసి షాకైపోయారు. కొందరు తమ సెల్‌ఫోన్లతో ఆ దృశ్యాల్ని రికార్డు చేశారు. ఇంత జరుగుతున్నా ఆ జంట ఒకరినొకరు పెనవేసుకొంటూ లోకాన్ని మర్చిపోయారు. ప్రపంచాన్ని లెక్కచేసేదే లేదననట్టు తమదైన లోకంలో విహరించారు. ఇక ఈ వీడియో నెట్టింట కాలుపెట్టీపెట్టగానే వైరల్ అయిపోయింది. ఆ జంట తప్పుపొప్పులపై విశ్లేషణ మొదలైంది. ‘‘పబ్లిక్‌గా ఎవరైనా ఇలా చేస్తారా? మనుషులు ఎటు పోతున్నారో’’ అని ఓ వ్యక్తి వాపోయారు. ‘‘మంచి పని చేశారు. వారేమీ నేరం చేయలేదు. ఒకరినొకరు ప్రేమించారంతే..’’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు.

Viral: 43 ఏళ్లల్లో 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు! ఎందుకంటే..


కాగా, మెట్రోస్టేషన్‌లో కిస్‌లు, కౌగిలింతలు, చేతులు కలపడాలు వంటివాటికి అనుమతి లేదని మెట్రో అధికారులు కరోనా సంక్షోభ సమయంలో స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. అయితే, నాటి నిషేధాలు ఇప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నించారు. ‘‘ఓ జంట మెట్రో స్టేషన్‌లో ముద్దుపెట్టుకున్నారు. ఇందులో అభ్యంతరం చెప్పడానికేముంది. ప్రేమలో ఉన్న అనేక మంది గతంలో ఇలాగే చేశారు కదా.. ఇందులో కొత్తేముంది. భారతీయ చట్టాల ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో ముద్దుపెట్టడం నేరమేమీ కాదు. ముద్దు, లేదా కౌగిలింతలు ప్రేమను వ్యక్త పరిచేందుకు సహజమైన, చట్టబద్ధమైన విధానం’’ అని ఓ లాయర్ వ్యాఖ్యానించారు. అయితే, మెట్రో స్టేషన్ అధికారులు మాత్రం ఈ వీడియోపై ఇంకా స్పందించాల్సి ఉంది. ఘటన ఎప్పుడు జరిగిందీ తెలియకపోయినప్పటికీ ఘటనపై చర్చ మాత్రం ఓ రేంజ్‌లో కొనసాగుతోంది.

Viral: మరో మహిళ భర్త కోసం రూ.1.39 కోట్లు చెల్లించి.. చివరకు రిఫండ్ కోసం పట్టు

Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!

Read Latest and Viral News

Updated Date - Dec 17 , 2024 | 07:36 PM