ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: మరణ శిక్షకు ముందు కోర్టులో ఖైదీ వింత కోరిక

ABN, Publish Date - Jul 21 , 2024 | 03:41 PM

న్యాయమూర్తి మరణ శిక్ష విధించే ముందు కోర్టులో ఓ ఖైదీ కోరిన వింత కోరిక ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశం అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: న్యాయమూర్తి మరణ శిక్ష విధించే ముందు కోర్టులో ఓ ఖైదీ కోరిన వింత కోరిక ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశం అవుతోంది (Viral). అయితే, ఖైదీ ఏం చెప్పినా తనపై ప్రభావం చూపించబోదన్న న్యాయమూర్తి అతడికి మరణ శిక్ష విధించాడు. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: ఇదేం పైత్యం దేవుడా! డిప్రెషన్‌లో ఎలుగుబంటి! సెల్ఫీ కోసం జనాల ఆరాటం!


ఫ్లోరిడాకు చెందిన స్టీవెన్ లొరెంజో అనే 65 ఏళ్ల నిందితుడు 2016లో ఇద్దరు యువతులను పొట్టన పెట్టుకున్నాడు. ఓ పబ్‌లో వారిని కలుసుకున్న నిందితుడు యువతులిద్దరికీ మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తరువాత వారికి డ్రగ్స్ ఇచ్చి మత్తులో ఉన్న వారిని చంపేశాడు. ఈ దారుణంలో లొరెంజోకు అతడి స్నేహితుడు కూడా సహకరించాడు. తరువాత అతడు చేసిన తప్పును కోర్టు ముందు అంగీకరించాడు. లొరెంజో మాత్రం తొలుత తాను తప్పు చేయలేదని అన్నా ఆ తరువాత తనకు మరణశిక్ష విధించాలంటూ 177 పేజీల లేఖ రాశాడు (Criminal Makes Bizarre Request For Death Penalty In Shocking Courtroom Moment).


ఇదిలా ఉంటే కోర్టు అతడికి తాజాగా మరణ శిక్ష విధించింది. అయితే, న్యాయమూర్తి తన తీర్పు చదివే ముందు లొరెంజో మాట్లాడుతూ తనకు మరణ శిక్ష విధించాలని కోరాడు. ఎంత త్వరగా తనకు మరణ శిక్ష విధిస్తే అంత త్వరగా తాను మరో శరీరంతో ఈ భూమ్మీదకు వస్తానన్నాడు. అయితే, న్యాయమూర్తి మాత్రం లొరెంజో మాటలను లెక్కచేయలేదు. నిందితుడి రివర్స్ సైకాలజీ ప్రయోగం తనపై పనిచేయదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లొరెంజో దారుణమైన నేరానికి పాల్పడ్డాడని అన్నాడు. అతడి అభిప్రాయాలను తాను ఎన్నటికీ పరిగణలోకి తీసుకోనని స్పష్టం చేశారు. తను అంతకుముందే తీసుకున్న నిర్ణయం ప్రకారం మరణశిక్ష విధించారు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరణ శిక్ష పడ్డాక కూడా నిందితుడిలో కొంచెం కూడా పశ్చాత్తపం కనిపించలేదు.

Read Viral and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 04:03 PM

Advertising
Advertising
<