Viral: వార్నీ..ఈ సీన్ ఎప్పుడూ చూడలేదే! బస్సు టాపు ఎక్కి కాకుల జర్నీ..
ABN, Publish Date - Jul 18 , 2024 | 06:28 PM
ఆర్టీసీ బస్సుపై ఉంటే నగర ప్రయాణం చేస్తున్న ఓ కాకుల గుంపు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అరుదైన దృశ్యమంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. కాకులు ముంబై పర్యటనలో ఉన్నాయని సరదా కామెంట్స్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పక్షులన్నాక ఏదో చోట వాలడం ఆ తరువాత ఎగిరిపోవడం చూస్తూనే ఉంటాం. పావురాలు, కాకులు వీధుల్లో గింజలు వేసిన సందర్భాల్లో బాగా వాలుతుంటాయి. కాస్త అదిలిస్తే వెంటనే ఎరిగిపోతాయి. కానీ, ఓ కాకుల మంద ఏకంగా ఆర్టీసీ బస్సు టాపెక్కి ఎంచక్కా ట్రాఫిక్‌లో ఎంజాయ్ చేయడం జనాలను తెగ ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో (Viral) ఉంది.
Viral: ఇతడి తెలివికి పోలీసుల ప్రశంసలు! కుమారుడు అరెస్టయ్యాడని కాల్ వస్తే..
వీడియోలో చూపించిన దాని ప్రకారం ఈ దృశ్యం ముంబైలోనిది. మహారాష్ట్ర ఆర్టీసికి చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సుపై దాదాపు అరడజను కాకులు కూర్చుని ఫుల్లుగా ఎంజాయ్ చేశాయి. కానీ, వాహనదారులు మాత్రం ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయారు. చాలా మందికి అసలే ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదు. కాకులు అలా ఎందుకు చేశాయో అర్థంకాక తికమకపడ్డారు. కొందరు వీటిని రికార్డు చేసి నెట్టింట పెట్టడంతో ఈ దృశ్యం వైరల్‌గా మారింది (Crows take a bus ride in mumbai).
@krownnist అనే ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. వీడియో నిడివి కేవలం 4 సెకెన్లే అయినా జనాలు ఈ సీన్స్ విరగబడి చూస్తుండటంతో ఏకంగా పది లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక కామెంట్స్ కూడా ఇదే రేంజ్‌లో వచ్చిపడ్డాయి. కాకులన్నీ కలిసి ముంబై టూర్ ప్లాన్ చేశాయా అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. అన్ని కలిసి ఏదైనా మార్కె్ట్‌కు వెళుతున్నాయేమో అని తుంటరి ప్రశ్న సంధించారు. కొందరేమో ఈ సీన్ కాస్సోన్ డాక్స్ సమీపంలోనిదని అన్నారు. అక్కడి సీఫుడ్ మార్కెట్ ఉందని కాకులు అక్కడికే వెళుతుండాలని అన్నారు. ఎగిరి ఎగిరి అలిసిపోయిన కాకులు చివరకు ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకుంటున్నాయని కొందరు అన్నారు. ఇలా ఫ్రీగా జర్నీ ఎంజాయ్ చేయొచ్చని కాకులు తెలివి వాటి సొంతం కాబట్టే కాకులను తెలివైన పక్షులు అని అంటారన్నారు. ఇలా రకరకాల కామంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది.
Updated Date - Jul 18 , 2024 | 06:28 PM