ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: స్విగ్గీలో కూరగాయలు ఆర్డరిస్తున్నారా? ఇతడికేమైందో తెలిస్తే..

ABN, Publish Date - Nov 19 , 2024 | 05:18 PM

ఓ వినియోగదారుడు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్డిరిచ్చిన వాటికంటే తక్కువ బరువున్న కూరగాయలు డెలివరీ అయ్యాయంటూ మండిపడ్డాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో పచారీ సామాన్ల కొనుగోళ్లు ఇప్పుడు ఊపందుకున్నాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి అనేక సంస్థలు ఆర్డరిచ్చిన నిమిషాల వ్యవధిలో పచారీ సామాన్లన్నీ ఇంటితెచ్చిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సార్లు తప్పులు దొర్లుతున్నాయంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఓ వినియోగదారుడు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్డిరిచ్చిన వాటికంటే తక్కువ బరువున్న కూరగాయలు డెలివరీ అయ్యాయంటూ మండిపడ్డాడు. కస్టమర్ కేర్ తీరును కూడా ఎండగట్టాడు (Viral)..

Viral: దేవత అంటే ఈమెనే! లాటరీలో గెలిచిన రూ.121 కోట్లతో..


‘‘కాలీఫ్లవర్ బరువు తక్కువగా ఉండటంతో నాకు అనుమానం వచ్చింది. వెంటనే ఇతర కూరగాయల బరువు కూడా చెక్ చేశా. అన్నీ బరువు తక్కువగానే ఉన్నాయి. కిలో బంగాళదుంపలు ఆర్డరిస్తే 965 గ్రాముల బంగాళదుంపలు డెలివరీ అయ్యాయి. 250 గ్రాముల క్యాప్సికమ్ బదులు 170 గ్రాములు డెలివరీ ఇఛ్చారు’’ అని అతడు చెప్పుకొచ్చాడు.

తన సమస్యపై స్విగ్గీ కస్టమర్ సపోర్టు కూడా సంతృప్తికరంగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పూర్తి డబ్బులు రిఫండ్ చేయమని కోరగా కేవలం రూ.89 రూపాయలే వెనక్కు ఇస్తామని కస్టమర్ కేర్ వారు చెప్పినట్టు రెడిట్‌లో వెల్లడించాడు. డెలివరీ అయిన ఐటమ్స్‌‌కు బదులు కొత్తవి ఇవ్వాలన్న అభ్యర్థనను వారు నిస్సిగ్గుగా తిరస్కరించారని గుస్సా అయ్యాడు. ఈ సమస్యపై తాను ప్రభుత్వం ఐఎన్‌జీఆర్ఏఎమ్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు. క్రెడిట్ అయిన డబ్బును వెనక్కు తీసుకోవాలని బ్యాంకుకు కూడా మెయిల్ చేసినట్టు వివరించాడు. ‘‘యాప్‌లో కనిపించే వెయిట్ స్టిక్కర్లను చూసి మోసపవద్దు. ఇంటికి డెలివరీ అయిన వస్తువుల బరువును స్వయంగా తూకం వేసి చూసుకోండి’’ అని అతడు చెప్పుకొచ్చాడు.

Banana Phobia: మహిళా మంత్రికి వింత భయం! అధికారిక కార్యక్రమాల్లో అరటి పళ్లపై నిషేధం!


కాగా, ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తమకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అనేక మంది నెట్టింట పేర్కొన్నారు. స్విగ్గీకి ఇదో అలవాటుగా మారిందని కొందరు వ్యాఖ్యానించారు. ఇదేమీ అనుకోకుండా జరిగిన తప్పిందం కాదని చెప్పుకొచ్చారు. ఒక్క రోజులో స్విగ్గీ ఎన్ని పచారీ సామాన్లు డెలివరీ చేస్తోందో ఎన్నింట్లో సేవా లోపాలు ఉంటున్నాయో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తోందని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు.

కాగా, వైరల్ అవుతున్న ఈ పోస్టుపై స్విగ్గీ కూడా స్పందించింది. జరిగిన దానిపై విచారం వ్యక్తం చేసింది. తన ఈమెయిల్ ఐడీ షేర్ చేస్తూ సమస్యలపై తమకు లేఖ రాయాలని పేర్కొంది. తక్షణం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు

Read Latest and Viral News

Updated Date - Nov 19 , 2024 | 05:22 PM