Viral News: తలపై టూ వీలర్ పెట్టుకొని
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:38 PM
ఉత్తర భారతదేశంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దామో ఏరియాలో వరద పోటెత్తింది. బటియాగఢ్ నుంచి టూ వీలర్ మీద ఓ యువకుడు స్వగ్రామం మగ్రాన్ వెళ్తున్నాడు. అతని వాహనం బ్రిడ్జీ వద్దకు రాగానే వరద ప్రవాహం పెరిగింది.
భారీ వర్షాలు (Rains) వరదలతో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. వరదనీటితో జనం తెగ ఇబ్బంది పడుతున్నారు. మధ్యప్రదేశ్ దామోలో ఓ వ్యక్తి చేసిన ఫీట్ చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఆ అంశం గురించి డిస్కష్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..
తలపై టూ వీలర్..
ఉత్తర భారతదేశంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దామో ఏరియాలో వరద పోటెత్తింది. బటియాగఢ్ నుంచి టూ వీలర్ మీద ఓ యువకుడు స్వగ్రామం మగ్రాన్ వెళ్తున్నాడు. అతని వాహనం బ్రిడ్జీ వద్దకు రాగానే వరద ప్రవాహం పెరిగింది. అప్పుడు టూ వీలర్ నడపడం వీలు పడలేదు. ఏరి మరి కొనుకున్న వాహనాన్ని వదిలి వేయాలని అనిపించలేదు. ఆ వాహనాన్ని తలపై పెట్టుకొని నడవడం ప్రారంభించాడు. వరద ప్రవాహం పెరుగుతోన్న.. దాదాపు 100 మీటర్ల వరకు నడిచాడు. తన టూ వీలర్‌తో రోడ్డు మీదకు చేరుకున్నాడు. నిజానికి అతను చేసింది ఫీటే.. వరద ప్రవాహంలో బండిని తలపై తీసుకెళ్లడం ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బ్యాలెన్స్ తప్పి.. ఆ వెంటనే
తలపై టూ వీలర్ పెట్టుకొని వెళ్లే క్రమంలో కొన్నిసార్లు అతను బ్యాలెన్స్ తప్పారు. ఆ వెంటనే బ్యాలెన్స్ సరిచేసుకొని ముందుకు కదిలారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అతన్ని బాహుబలి అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతనికి ఒక్కొడికే సాధ్యం అయ్యిందని గుర్తుచేశారు. అతను రీల్ హీరో కాదు.. రియల్ హీరో అని పొగడ్తల వర్షం కురిపించారు. ఆ విధంగా మిగతా వారు చేయొద్దని సూచించారు. ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
Updated Date - Sep 12 , 2024 | 03:39 PM