ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: తండ్రి హత్య! 25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం!

ABN, Publish Date - Oct 17 , 2024 | 03:02 PM

తన తండ్రిని హత్య చేసిన వ్యక్తిపై ఓ బాలిక ఊహించని రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. తండ్రి మరణం తరువాత పట్టుదలతో చదివి పోలీసు అధికారిగా మారిన ఆమె పరారీలో ఉన్న హంతకుడిని వెతికి పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టింది.

ఇంటర్నెట్ డెస్క్: తన తండ్రిని హత్య చేసిన వ్యక్తిపై ఓ బాలిక ఊహించని రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. తండ్రి మరణం తరువాత ప్రతీకారం కోసం తపించిన ఆమె పట్టుదలతో పోలీసు అధికారిగా మారిన తన లక్ష్యాన్ని సాధించింది. బ్రెజిల్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా (Viral) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Viral: దసరా నాడు టెకీ నిర్వాకం! అమ్మవారి పూజ జరుగుతుండగా లాప్‌‌టాప్ తెరిచి..


అది 1999. అప్పటికి జస్లెయిన్ సిల్వా డీసూస్ వయసు కేవలం 9 ఏళ్లు. ఆమెకు మరో నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఆ కుటుంబానికి ఆమె తండ్రి జివాల్డో డీ డూస్ సంపాదనే ఆధారం. ఓ రోజు ఏదో ఆటలో పదెం కాసిన జివాల్డో తన స్నేహితుడు ఆల్వెస్ గోమెస్‌కు 25 డాలర్లు బాకీ పడ్డాడు. అప్పు తీర్చే క్రమంలో ఆలస్యం జరిగింది దీంతో ఆల్వెస్‌కు జివాల్డోకు వివాదం తలెత్తింది. అప్పు తీర్చే ప్రయత్నంలో ఉండగానే జివాల్వోను ఆల్వెస్ పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి పారిపోయాడు. జివాల్డో కన్నుమూశాడు. జివాల్డో మరణంతో ఆ కుటుంబం భారమంతా జస్లెయిన్ తల్లి మీద పడింది. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఆ పరిస్థితుల్లో కుటుంబమంతా చెల్లాచెదురైపోవాల్సిన మాటే. కానీ జస్లెయిన్ తల్లి పంటిబిగువున కష్టాలను అధికమిస్తూ పిల్లల్ని పద్ధతిగా పెంచి పెద్ద చేసింది. తమ కుటుంబానికి ఇన్ని కష్టాలకు కారణమైన ఆల్వెస్‌పై జస్లెయిన్‌కు పగ విపరీతంగా పెరిగింది. అయితే, నైతిక నియమాలను అతిక్రమించద్దన్న తల్లి ఉద్బోధలతో ఆమె న్యాయప్రకరామే అతడిపై ప్రతీకారం తీర్చుకుంది.

Viral: రైల్వే ఉద్యోగానికి రాజీనామా.. స్పేస్‌ఎక్స్‌లో జాబ్! టాలెంట్ అంటే ఇదీ!


ప్రతీకారమే ఊపిరిగా పెరిగిపెద్దయిన ఆమె 18 ఏళ్ల వయసులో న్యాయవిద్యలో చేరింది. ఆ చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరింది. కొంతకాలానికి ఆమె పోలీసు ఉద్యోగం సాధించింది. ఆ తరువాత హత్య కేసుల విచారణకు సంబంధించిన విభాగంలో పట్టుబట్టి మరీ పోస్టింగ్ వేయించుకుంది. ఆ వెంటనే ఆమె తండ్రి హంతకుడిపై దృష్టి పెట్టింటి. అప్పటికే అతడు 13 ఏళ్లుగా పరారీలోనే ఉన్నాడు. 2013లోనే అతడిపై ఈ హత్య కేసులో నేర్థస్తుడిగా కోర్టు తేల్చింది.

ఈ క్రమంలో నిందితుడి జాడ కనుక్కునేందుకు భూమ్యాకాశాలు ఏకం చేసిన జస్లెయిన్ చివరకు అనుకున్నది సాధించింది. గతనెలలోనే నిందితుడి ఆచూకీ కనుక్కుని అదుపులోకి తీసుకుంది. అప్పటికే అతడికి 12 ఏళ్ల కారాగార శిక్ష పడటంతో నిందితుడు చివరకు జైలు పాలయ్యాడు. నిందితుడు పట్టుబడ్డాక తనలో భావోద్వేగం కట్టలు తెంచుకుందని, అన్నాళ్ల పగ కన్నీటి రూపంలో బయటకొచ్చిందని ఆమె చెప్పింది. ‘‘పగ, ప్రతీకారం తీర్చుకునేందుకు అడ్డదారులు తొక్కక్కర్లేదని చెప్పడమే నా ఉద్దేశం. ఈ ఉదంతంతో ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఆశిస్తున్నా’’ అని ఆమె తెలిపింది.

Viral: గ్రహాంతరవాసులు ఉన్నారు! త్వరలో శాస్త్రవేత్తల కీలక ప్రకటన!!

Read Latest and Viral News

Updated Date - Oct 17 , 2024 | 03:11 PM