ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు! స్విగ్గీలో కండోమ్స్‌కు ఆర్డర్ పెడితే..

ABN, Publish Date - Nov 23 , 2024 | 09:31 PM

ఆన్‌లైన్‌లో కండోమ్స్‌కు ఆర్డరిచ్చిన ఓ వ్యక్తి ఆఫీసులో తన పరువు పోయిందంటూ నెట్టింట షేర్ చేసిన ఓ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. ఇలాక్కూడా జరుగుతుందా అని కొందరు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో కండోమ్స్‌కు ఆర్డరిచ్చిన ఓ వ్యక్తి ఆఫీసులో తన పరువు పోయిందంటూ నెట్టింట షేర్ చేసిన ఓ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. ఇలాక్కూడా జరుగుతుందా అని కొందరు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తరచూ బ్లింకిట్‌లో కండోమ్స్ ఆర్డరిచ్చే తను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డరిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురైందీ చెబుతూ ఢిల్లీకి చెందిన వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది (Viral).

Viral: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తపై భార్య వింత రివెంజ్.. షాకింగ్ వీడియో!


తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ అతడు రెడిట్‌లో ఈ పోస్టు పెట్టాడు. ‘‘కండోమ్స్ కొనుక్కోవడం పెద్ద విషయమేమీ కాదు. నేను తరచూ బ్లింకిట్‌లో వీటికి ఆర్డర్ పెడుతుంటా. కండోమ్స్ ప్యాకెట్ బయటకు కనపడకుండా వాళ్లు ముదురు గోధుమ రంగు ప్యాకేజింగ్‌లో పెట్టి పంపిస్తుంటారు. కానీ ఈసారి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ పెట్టా. డెలివరీ కోసం ఆఫీస్ అడ్రస్ ఇచ్చా. వీళ్లు కూడా విచక్షణ పాటించి లోపల ఏముందీ కనబడని విధంగా ప్యాక్ చేసి పంపిస్తారనుకున్నా. ఇది చాలదన్నట్టు ప్యాకేజీని ఆఫీస్ రిసెప్షన్ వద్ద వదిలిపెట్టమన్నా. ఆ తరువాత అక్కడికెళ్లి చూస్తే నాకు గుండె ఆగినంత పనైంది. కండోమ్స్ బయటకు కనిపించేలా పారదర్శక ప్యాకింగ్‌లో డెలివరీ చేశారు. ఇప్పుడు నా గురించి ఆఫీసంతా ఏమనుకుంటోందో’’ అని అతడు పోస్టు పెట్టాడు.

Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..


ఈ పోస్టు చూస్తుండగానే వైరల్ అయిపోయింది. అతడి పరిస్థితిపై జాలిపడ్డ కొందరు ఇలా జరుగుతుందని అతడు ఊహించలేక పోయాడని వ్యాఖ్యానించారు. అనేక మంది అతడిపై ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. అతడి నిర్ణయాన్ని తప్పుపట్టారు. కండోమ్స్, ఇతర శానిటరీ ఉత్పత్తులను ఆర్డర్ చేయడం మనం ఇంకా నామోషీగా భావిస్తున్నామా అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఇలాంటి వాటిని అత్యవసర వస్తువులుగా భావించాలని అని సలహా ఇచ్చారు. కొందరు మాత్రం స్విగ్గీకి మద్దతుగా నిలిచారు. సంస్థ చేసిన దాంట్లో తప్పేమీ లేదని పేర్కొన్నారు. కండోమ్స్‌ను సాధారణ వస్తువుగా భావించిన స్విగ్గీ అందుకు తగ్గట్టుగా దాన్ని డెలివరీ చేసిందన్నారు. గర్భనిరోధక సాధనాల విషయంలో భారతీయుల తీరులో ఇంకా మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.

Viral: బ్రిటన్‌లో జాబ్ ఇంటర్వ్యూకు హాజరైన భారతీయ యువతికి షాకింగ్ అనుభవం!

Read Latest and Viral News

Updated Date - Nov 23 , 2024 | 09:36 PM