Viral Video: అందరికీ ఇలాంటి టీచర్ ఉండాలి.. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ఎలా పాఠం చెబుతున్నారో చూడండి..
ABN , Publish Date - Nov 03 , 2024 | 04:20 PM
చక్కగా అర్థమయ్యేలా సులభంగా పాఠాలు బోధించే టీచర్ దొరికితే ఆ పిల్లలు మంచి జ్ఞానవంతులు అవుతారు. స్కూల్‌కు వెళ్లాలనే ఆసక్తి మాత్రమే కాదు, కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఇష్టాన్ని కూడా పెంచుకుంటారు. అయితే అంత నైపుణ్యం, అంకిత భావం గల టీచర్లు దొరకడం చాలా అరుదు.
చక్కగా అర్థమయ్యేలా సులభంగా పాఠాలు బోధించే టీచర్ (Teacher) దొరికితే ఆ పిల్లలు (Students) మంచి జ్ఞానవంతులు అవుతారు. స్కూల్‌కు వెళ్లాలనే ఆసక్తి మాత్రమే కాదు, కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఇష్టాన్ని కూడా పెంచుకుంటారు. అయితే అంత నైపుణ్యం, అంకిత భావం గల టీచర్లు దొరకడం చాలా అరుదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ టీచర్ తన పిల్లల చేత క్లాస్‌రూమ్‌లో ఓ ఫన్ యాక్టివిటీ (Classroom activity) చేయించారు. ఆ విధంగానే పాఠం చెబుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
sapna_primaryclasses అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఢిల్లీ (Delhi)లోని ఓ ప్రైమరీ స్కూల్ క్లాస్‌రూమ్‌లో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో సప్న అనే టీచర్ తరగతి గదిలో పిల్లల చేత ఓ యాక్టివిటీ చేయిస్తున్నారు. ఎత్తు (Height)కు, రెండు చేతుల మధ్య దూరానికి సంబంధం ఉందనే పాఠాన్ని ప్రాక్టికల్‌గా చూపించారు. క్లాస్‌రూమ్‌లోని బోర్డ్ దగ్గర ఆమె ముందుకు వంగి ఒక చేతిని నేలపై పెట్టారు. మరో చేతిని పైకి పెట్టారు. పై చేయి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ మార్క్ చేశారు. లేచి నిల్చుంటే ఆమె హైట్ సరిగ్గా ఆ మార్క్ దగ్గరకే వచ్చింది.
క్లాస్‌లో పిల్లలందరి చేత ఆ యాక్టివిటీ చేయించారు. అలా సులభంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో చాలా వైరల్ అయింది. 1.6 కోట్ల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. 3.1 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వావ్.. చాలా కొత్త విషయం అర్థమయ్యేలా చెప్పారు``, ``మంచి టీచర్``, ``కొంత మందికి తమ ఎత్తు కంటే ఎక్కువ పొడవైన చేతులు ఉండొచ్చు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Hijab protest: ఇరాన్‌లో హిజాబ్‌పై నిరసన.. బహిరంగంగా బట్టలు విప్పి తిరగిన మహిళ.. వీడియో వైరల్..
Optical Illusion Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితేనే.. ఈ సీతాకోక చిలుకల మధ్యనున్న చీమను పట్టుకోగలరు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..