Viral: రోడ్డు మీద ఇదేం పని తల్లీ..! టైం బాలేకపోతే నిన్నెవరూ కాపాడలేరు!
ABN, Publish Date - Nov 14 , 2024 | 06:40 PM
దెయ్యంగా మేకప్ వేసుకుని వీధుల్లో సంచరించిన ఓ యువతి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో ప్రాంక్ వీడియోలపై జనాల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దీంతో, ఈ వీడియోలు ట్రెండింగ్‌లోకి రావడం తగ్గిపోయినా అడపాదడపా ఇవి వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా నెట్టింట అలాంటి ఓ వీడియోపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తన టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ఓ మహిళ జనాల్ని భయపెట్టేందుకు నడుం కట్టింది. అయితే, నెటిజన్లు మాత్రం ఈ ప్రయత్నంపై పెదవి విరుస్తు్న్నారు. పిల్లల్ని భయపెట్టొద్దని విజ్ఞప్తులు చేస్తున్నారు (Viral).
Viral: ఏంటీ.. ఇది భారతీయ ఎయిర్‌పోర్టా! జపాన్ యువతికి షాక్!
ఢిల్లీకి చెందిన మేకప్ ఆర్టిస్ట్ షఫాలీ నాగ్‌పాల్ ఈ వీడియోను పోస్టు చేసింది. ఇందులో ఆమె భూతంలా మేకప్ వేసుకుని వీధుల్లో చెక్కర్లు కొట్టింది. రక్తం మరకలు ఉన్నట్టు రంగులు వేసున్న తెల్లని స్లీవ్‌లెస్ డ్రెస్‌ను ధరించి ఆమె వీధుల్లో నడిచింది. ముఖంపై కూడా రక్తం కారుతున్నట్టు మేకప్ వేసుకుంది. అందుకు తగ్గట్టుగా వీధిలో మెల్లగా నడుస్తూ జనాల్ని భయపెట్టే ప్రయత్నం చేసింది.
Viral: వావ్.. దోస ప్రింటింగ్ మెషీన్! ఆనంద్ మహీంద్రా ఫిదా!
భయానక మేకప్‌తో ఉన్న ఆమెను చూసి పిల్లలు కొందరు భయపడ్డారు. మరికొందరు పెద్దలు కూడా ఆమెవైపు ఆశ్చర్యంగా నమ్మశక్యం కానట్టు చూశారు. కొందరు మాత్రం ఆమె మేకప్ వేసుకుందని ఇట్టే అర్థం చేసుకుని నవ్వుకుంటూ వెళ్లిపోయారు. మరికొందరు ఆమెను ఫొటో తీసేందుకు కూడా ప్రయత్నించడంతో వారిని మహిళ చేతులు ఊపుతూ పలకరించింది. కొంత దూరం అలాగే నడిచిన ఆమె దగ్గరకు ఓ కుక్క రావడంతో భయపడిపోయింది. నా వెంట కుక్క పడిందంటూ ఆమె పరుగు లంఘించుకుంది.
Viral: జపాన్ వీధుల పరిశుభ్రతను పరీక్షించిన భారతీయ యువతి! రిజల్ట్స్ చూసి షాక్
ఇక వీడియో చూసిన జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వీధుల్లో ఇలాంటి పనులు చేసి ఇతరులను ఇబ్బంది పెట్టొద్దని హితవుపలికారు. ఇలాంటి వారిని చూశాక పిల్లలకు దడుపు జ్వరాలు వస్తాయని కొందరు అన్నారు. పెద్దలు పట్టించుకోకపోయినా పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన మేకప్ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ఇతర మార్గాలు ఎంచుకోవాలని కొందరు చెప్పారు. కుక్కలు వెంట పడొచ్చన్న ఆమె వెంట కుక్క పడటాన్ని ప్రస్తావిస్తూ.. టైం బాలేకపోతే ఆ కుక్క నుంచి దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.
Viral: పెళ్లిలో వధూవరులకు భారీ షాక్! మా తప్పేంటో చెప్పండంటూ ఆవేదన
Viral: ప్రసవ సమయంలో డాక్టర్ల పొరపాటు.. 18 ఏళ్లుగా మహిళకు నరకం
Updated Date - Nov 14 , 2024 | 06:47 PM