ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: చెత్త కుప్పలో రూ.5 లక్షల డైమండ్ నెక్లెస్.. చివరికి ఎవరికి చేరిందంటే

ABN, Publish Date - Jul 22 , 2024 | 01:19 PM

ఖరీదైన వస్తువులను ఏదో ఒక సందర్భంలో చాలా మంది ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటారు. అలాంటప్పుడు కోపం, ఆందోళన రావడం సహజమే. కానీ ఓ వ్యక్తి చాకచక్యం.. పోయిందనుకున్న ఖరీదైన వస్తువు తిరిగి వచ్చేలా చేసింది.

చెన్నై: ఖరీదైన వస్తువులను ఏదో ఒక సందర్భంలో చాలా మంది ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటారు. అలాంటప్పుడు కోపం, ఆందోళన రావడం సహజమే. కానీ ఓ వ్యక్తి చాకచక్యం.. పోయిందనుకున్న ఖరీదైన వస్తువు తిరిగి వచ్చేలా చేసింది.

చెన్నైలో నివసిస్తున్న దేవరాజ్ అనే వ్యక్తి తన కుమార్తె పెళ్లి కోసం రూ.5లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ చేయించాడు. ఈ మధ్య చెత్తను పారేస్తుండగా పొరపాటున ఆ చెత్తలో డైమండ్ నెక్లెస్ డబ్బాను విసిరేశారు. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన దేవరాజ్ నెక్లెస్ కోసం చెన్నై కార్పొరేషన్‌ అధికారులను సంప్రదించారు. అక్కడి అధికారులు.. వ్యర్థాల నిర్వహణ కోసం చెన్నై కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు విషయం చేరవేశారు.


స్పందించిన అధికారులు పారిశుద్ధ్య కార్మికుల సాయంతో చెత్త డబ్బాలను వెతికించగా.. చెత్త కుప్పలో డైమండ్ నెక్లెస్ లభించింది. అధికారులు డైమండ్ నెక్లెస్‌ని వెతికిపెట్టి ఇవ్వడంతో దేవరాజ్ హర్షం వ్యక్తం చేశాడు. పారిశుద్ధ్య కార్మికులు గంటకుపైగా వెతకడంతో చెత్త కుండీలోనే ఆ నెక్లెస్ లభ్యమైంది. అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు దేవరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.

For Latest News and National News click here

Updated Date - Jul 22 , 2024 | 01:19 PM

Advertising
Advertising
<