Viral: డైవర్స్ తీసుకున్న మహిళ రెండో పెళ్లికి పెట్టిన కండీషన్స్.. జనాలకు షాక్!
ABN, Publish Date - Sep 12 , 2024 | 05:42 PM
రెండో పెళ్లికి సిద్ధమైన ఓ మహిళ వరుడి అర్హతలకు సంబంధించి పెట్టిన కండీషన్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె గొంతెమ్మకోరికలు చూసి జనాలు షాకైపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లికి సంబంధించి ఎవరి అంచనాలు వారికి ఉంటాయి. కాబోయే భాగస్వామి అందచందాలు, చదువు, ఉద్యోగం, జీతనాతాలు, సామాజిక హోదా.. ఇలా ప్రతి విషయంలోనూ ముందే ఓ అభిప్రాయం ఏర్పరుచుకుంటారు. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు కానీ ఓ మహిళ తన రెండో పెళ్లి విషయంలో పెట్టిన కండీషన్లు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు (Viral).
Viral: నేటి తరం చిన్నారులు ఎలా ఉన్నారో తెలుసా? వీడియో చూస్తే షాక్ పక్కా!
డైవర్స్ తీసుకున్న ఓ మహిళ రెండో పెళ్లి కోసం పెట్టిన కండీషన్లను ఓ వ్యక్తి నెట్టింట పంచుకున్నారు. దీంతో, ఈ ఉదంతం ఒక్కసారిగా హాట్‌టాపిక్ అయిపోయింది. తనకు కాబోయే వాడికి ఏయే అర్హతలు ఉండాలో ఆమె తన మాట్రిమోనియల్ ప్రొఫైల్‌లో పంచుకుంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, తనకు కాబోయే జీవిత భాగస్వామికి రూ.30 లక్షల శాలరీ ఉండాలి. 3 బెడ్‌రూం ఇల్లు ఉండాలి కానీ అత్తమామలు మాత్రం అక్కడ ఉండొద్దు (divorcee Womans High Demands For Future Husband Stirs Online Debate).
Viral: ఆత్మహత్యాయత్నం.. రైలు రావడం ఆలస్యమయ్యేసరికి పట్టాలపైనే కునుకు!
కాబోయే వాడు కనీసం ఎంబీయే చేసుండాలని, ఎన్నారై అయితే ఏటా కనీసం 90 వేల డాలర్లు సంపాదించాలని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, పెళ్లయ్యాక భర్త తరచూ టూర్లపై తీసుకెళ్లాలట. ఫైవ్ స్టార్ హోటళ్లలోనే మకాం పెట్టాలట. తన తల్లిదండ్రులు కూడా తనతోనే ఉంటారని చెప్పింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా ఇంటి పని చేయలేనని, కాబట్టి పని మనిషి, వంట మనిషి తప్పనిసరని కూడా చెప్పుకొచ్చింది. ఇక తను, డైవర్సీ అని, తన జీతం సంవత్సరానికి రూ1.3 లక్షలని తెలిపింది. అయితే, ఆమెను డైవర్సీలు సంప్రదించొద్దని కోరడం కొసమెరుపు. (divorcee Womans High Demands For Future Husband Stirs Online Debate).
Viral: ఈ బాలికను ఇలాగే వదిలేస్తే బందిపోటు రాణి అవడం పక్కా! షాకింగ్ వీడియో
మహిళ కండీషన్లు చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. తన స్థాయి ఏంటో తెలుసుకోకుండా ఈ అలివిమాలిన కోర్కెలు ఏంటని కొందరు ప్రశ్నించారు. ఈ కాలంలో పెళ్లిళ్లు మగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని కొందరు అన్నారు. నెలకు పట్టుమని రూ.15 వేలు సంపాదించలేని మహిళకు, ఏటా రూ.30 లక్షలు సంపాదించే వ్యక్తి కావాలా? అని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Updated Date - Sep 12 , 2024 | 05:51 PM