ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: యాచకురాలికి దీపావళి నాడు కండోమ్ ఇచ్చిన డాక్టర్!

ABN, Publish Date - Nov 02 , 2024 | 01:51 PM

దీపావళి సందర్భంగా యాచకురాలికి కండోమ్ ఇచ్చిన డాక్టర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ఉన్మాదంలో అభ్యంతరకర పని చేసిన ఓ డాక్టర్‌పై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు డాక్టర్ దీపావళి సందర్భంగా బిడ్డతో ఉన్న యాచకురాలికి కండోమ్ ఇచ్చాడు. ఆపై ఇదంతా వీడియోలో రికార్డు చేసి నెట్టింట పంచుకున్నాడు. దీంతో, విమర్శలు ఆకాశాన్నంటాయి (Viral).

Kamala Harris: కమలా హారిస్ మా బిడ్డే.. తమిళనాడులోని ఈ కుగ్రామంలో మిన్నంటిన సంబరాలు


తొలుత ఆ డాక్టర్ ఫుట్‌పాత్‌పై బిడ్డతో కలిసి కూర్చున్న యాచకురాలిని సమీపించాడు. ఆమెకు డబ్బో లేదా ఆహారమో ఇవ్వకుండా తన వద్ద ఉన్న కండోమ్ తీసి ఇచ్చాడు. దీన్ని చూసిన చంటిబిడ్డ కండోమ్‌ను అందుకునే ప్రయత్నం చేయడంతో ఇది యాచకురాలికి మరింత ఇబ్బందిగా మారింది. డాక్టర్ మాత్రం ఏమీ జరగనట్టు, తను చేస్తున్నది తప్పని కూడా గుర్తించకుండా వీడియోలో రికార్డు చేసి నిస్సిగ్గుగా నెట్టింట పంచుకున్నాడు. ఇది చాలదన్నట్టు వీడియోపై..‘‘యాచకులకు చేసే అత్యుత్తమ సాయం ఇదే’’ అని ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. ఇది నెట్టింట పంచుకోగానే జనాలు అతడిని దబిడిదిబిడిలాడించారు.

Viral: ఈ శిశువు మృత్యుంజయుడు! తల్లిదండ్రులు వంతెనపై నుంచి విసిరేస్తే..


ఆ డాక్టర్‌ను విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘‘ఇది అసంబద్ధమే కాదు.. అవమానకరం కూడా.. ఆమె బాధలను నీ కంటెంట్ కోసం వినియోగించుకుంటావా.. అదీ ఆమె అనుమతి లేకుండా.. ఓ డాక్టర్‌గా, బాధ్యతగల పౌరుడిగా ఇలా చేసినందుకు సిగ్గనిపించలేదా?’’ అని ఓ వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిపై జాలీ దయా చూపించలేని నువ్వేమి డాక్టర్‌ అంటూ దుమ్మెత్తిపోశారు. గర్భనిరోధక సాధనాల గురించి అవగాహన పెంచడం సబబే కానీ మరీ ఇలా అవమానించడం పద్ధతి కాదని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఇలా జనాల విమర్శలు వెల్లువెత్తడంతో బెదిరిపోయిన డాక్టర్ వీడియోను ఎక్స్ ఖాతా నుంచి తొలగించాడు.

Read Latest and Viral News

Updated Date - Nov 02 , 2024 | 02:02 PM