ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో! వీడు మామూలోడు కాదు.. ఏ బ్రాండ్ తాగాడో గానీ.. చివరకు సింహాన్నే వణికించేశాడుగా..

ABN, Publish Date - Jan 30 , 2024 | 08:49 PM

ఓ పెగ్గు మందు గొంతులో పడితే కొందరు ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. తమలోకి ఏదో కొత్త శక్తి వచ్చినట్లు ఊగిపోతుంటారు. ఈ క్రమంలో ఏం చేస్తారో వారికే తెలీనంతగా మారిపోతుంటారు. ఇంకొందరు...

ఓ పెగ్గు మందు గొంతులో పడితే కొందరు ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. తమలోకి ఏదో కొత్త శక్తి వచ్చినట్లు ఊగిపోతుంటారు. ఈ క్రమంలో ఏం చేస్తారో వారికే తెలీనంతగా మారిపోతుంటారు. ఇంకొందరు ఎదురుగా ఉన్నది ఎవరైనా ఢీ అంటే డీ అంటుంటారు. ఫుల్‌గా మందు కొట్టి గేదెలతో ఫైట్ చేసిన వారిని చూశాం, పాములను మెడలో వేసుకుని డాన్సులు వేసిన వారిని కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి సింహంతో ఓ ఆట ఆడుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలోని (Delhi Zoo) జంతు ప్రదర్శన శాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోజూ లాగే ఆ రోజు కూడా అనేక మంది పర్యాటకులు జూలో జంతువులను చూడటానికి వచ్చారు. వారిలో బీహర్‌కు చెందిన ఓ యువకుడు కూడా ఉన్నాడు. అయితే అతను జూలోకి ఫుల్‌గా మందు కొట్టి వచ్చాడు. జంతువులను చూసే క్రమంలో అతను ఏకంగా (drunken man entered the lion enclosure) ఓ సింహం ఎన్‌క్లోజర్‌లోకే వెళ్లిపోయాడు. అంతటితో ఆగకుండా ఏకంగా సింహం సమీపానికి వెళ్లాడు. అయితే ఆశ్చర్యకరంగా సింహం కూడా అతడిపై దాడి చేయకుండా భయపడుతున్నట్లు కనిపించింది. దీంతో మందుబాబు మరింత రెచ్చిపోయాడు.

Viral Video: పట్టపగలే యువతికి షాక్ ఇచ్చిన పక్షి.. అంతా చూస్తుండగా.. పర్సు కొట్టేసి.. చివరకు..

అంత పెద్ద సింహాన్ని పిల్లి తరహాలో చూస్తూ.. అలా వెళ్లు, ఇలా వెళ్లు అంటూ ఆర్డర్లు వేస్తూ కనిపించాడు. సింహం కూడా అతడికి భయపడుతూ దూరంగానే ఉండిపోయింది. ఇంతలో అతన్ని గమనించిన జూ సిబ్బంది ఎలాగోలా అతన్ని రక్షించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‍‌కు తరలించారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మందుబాబా.. మజాకా’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం బాగుంది కాబట్టే ప్రాణాలతో బయటపడ్డాడు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: సింహానికి చిక్కిన గేదెల మంద.. దొరికిపోతాయనుకున్న సమయంలో ఒక్కసారిగా సీన్ రివర్స్..

Updated Date - Jan 30 , 2024 | 08:49 PM

Advertising
Advertising

సంబంధిత వార్తలు

మరిన్ని చదవండి