ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఫుల్లుగా తాగి టిక్కెట్లు బుక్ చేసిన యువతి! విమానం ఎక్కాక..

ABN, Publish Date - Sep 06 , 2024 | 09:10 AM

మద్యం మత్తులో ఓ యువతి జార్జియాకు బదులు ఇండియాకు టిక్కెట్లు బుక్ చేసుకుంది. విమానం ఎక్కాక ఆమె జరిగిన పొరపాటును గుర్తించి దిమ్మెరపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షి్స్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: మనిషన్నాక మతిమరుపు సహజం. కొందరు తమ వాహనాల తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. మరికొందరు తాము దిగాల్సిన స్టేషన్ మర్చిపోయి ముందుకెళుతుంటారు. ఇక డ్రింక్ చేసిన వారి మతిమరుపునకు అంతే ఉండదు. తాము ఏం చేస్తున్నదీ కనీసం గుర్తించే స్థితిలో కూడా ఉండరు. తాజాగా ఓ యువతి సరిగ్గా ఇలాగే చేసి దెబ్బైపోయింది. అసలేం జరిగిందీ చెబుతూ ఆమె షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

Viral: ఎంతటి కష్టం తల్లీ నీది! అర్ధరాత్రి 1 గంటకు ఆటో నడుపుతున్న మహిళ!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువతి తాగిన మైకంలో విమానం టిక్కెట్లు బుక్ చేసుకుంది. ఈ క్రమంలో భారీ పొరపాటు జరిగింది. ఆ విషయాన్ని ఆమె విమానం ఎక్కాక కానీ గుర్తించలేకపోయింది. వాస్తవానికి ఆమె జార్జియాకు వెళ్లాలి. కానీ తాగిన మైకంలో ఆమె ఇండియాకు వెళ్లే విమానం టిక్కెట్లు బుక్ చేసుకుంది. చివరకు విమానంలో కూర్చున్నాక గానీ ఆమెకు తాను చేసిన తప్పేంటో బోధపడలేదు (Drunk Woman Mistakenly Books And Boards Flight For India Instead Of Georgia ).

విమానం ఎక్కాక సీట్లో రిలాక్స్డ్‌గా కూర్చు్న్న ఆమెకు పైలట్ అనౌన్స్‌మెంట్ వినగానే దిమ్మతిరిగినంత పనైంది. అది ఇండియాకు వెళుతున్న విమానం కావడంతో పైలట్ హిందీలో ప్రకటన చేశాడు. ప్రయాణికులకు పలు జాగ్రత్తలు సూచించాడు. ఇదంతా విన్న ఆమె షాకైపోయింది. తాను ఇండియాకు వెళ్లే విమానంలో కూర్చున్నట్టు గుర్తించి దిమ్మెరపోయింది. ఆమె పక్కనున్న యువతి కూడా ఇలాగే తెల్లమొహం వేసింది.


ఇక వీడియోకు నెట్టింట మంచి స్పందన వస్తోంది. 3 వేలకు పైగా లైకులు, అంతకుమించి వ్యూస్ వస్తున్నాయి. తమకీ వీడియో నచ్చిందని అనేక మంది కామెంట్ చేశారు. మరికొందరు రకరకాల సందేహాలు లేవనెత్తారు. అసలు తాగిన వాళ్లను విమానంలోకి అనుమతిస్తారా అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. మరికొందరేమో ఒక అడుగు ముందుకేసీ ఇండియాలో సందర్శనీయ స్థలాల లిస్టు పెట్టారు. కొందరు మాత్రం ఆమెను తిట్టిపోశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతే కాకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా మద్యం మత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగిందని కొందరు సరదా కామెంట్ చేశారు. ఇలా రకరకాల వ్యాఖ్యల మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 06 , 2024 | 09:14 AM

Advertising
Advertising