Viral: ఈ ఏనుగుది ఎంతటి జాలి గుండె! సింహం పిల్లల్ని చంపే గోల్డెన్ ఛాన్స్ వచ్చినా కూడా..
ABN, Publish Date - Feb 16 , 2024 | 03:21 PM
ఏనుగు జాలి గుండె ఎంతటిదో కళ్లకు కట్టినట్టు చెప్పే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్ : అత్యంత తెలివైన అడవి జంతువుల్లో ఏనుగూ ఒకటి. మరే జంతువు దాని జోలికెళ్లేందుకు సాహసం చేయదు. మరి ఏనుగుకు ఇంతటి శక్తి ఉన్నప్పటికీ అవి కూడా ఇతర జంతువులకు అనవసరంగా అపకారం చేయవు. తమకు ప్రమాదం జరుగుతుందనుకుంటేనే తిరగబడతాయి. అయితే, ఏనుగులకు జాలి కూడా ఎక్కువే అని చెప్పే వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా (ViralVideo) మారింది.
ViralVideo: ఎవరు బ్రో నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు.. నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో ఇది!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, గుంపు నుంచి వేరైన ఓ తల్లి సింహం తన పిల్లలతో కలిసి అడవిలో వెళుతూ ఉండగా దానికి పెద్ద ఏనుగు తారస పడింది. ఏనుగు కూడా సింహాన్ని గమనించి వెంటనే దానిపై దాని చేసేందుకు వెంటపడింది. అది చూడగానే ఆడ సింహం ఓ పిల్లలను నోట కరుచుకుని వెనక్కు పరుగుతీసింది. అయితే, అప్పటికే దాని కాలికి దెబ్బ తగిలుండటంతో వేగంగా పరిగెత్తలేకపోయింది.
Study abroad: భారతీయుల్లో కెనడాపై అనాసక్తి.. ప్రస్తుతం మనోళ్ల చూపంతా అటే!
మరోవైపు, మిగిలిన పిల్ల సింహాలు కూడా బాగా కంగారు పడటంతో తల్లిని అనుసరించలేకపోయాయి. ఈలోపు వాటిని ఏనుగు సమీపించింది. ఆ ఏనుగు మరో అడుగు ముందుకేసే ఆ పిల్ల సింహాలు దాని కాళ్ల కింద పడి చనిపోయేవే. కానీ పిల్ల సింహాల్ని చూసిన వెంటనే ఏనుగు మనసు మార్చుకుని దాడి విరమించి, వెనక్కు మళ్లింది (Elephant attacks lioness but spares cubs). దీంతో, పిల్ల సింహాలు ప్రాణాలతో బతికిపోయాయి.
ఇదంతా చూసిన నెటిజన్లు ఏనుగు పెద్ద మనసుకు ఆశ్చర్యపోతున్నారు. ఇదే పరిస్థితుల్లో హైనాలాంటి జంతువు ఉండి ఉంటే ఇది గోల్డెన్ ఛాన్స్ అనుకుంటూ పిల్ల సింహాల్ని మట్టుపెట్టేదని చెప్పుకొచ్చారు. ఇతర జంతువులు పిల్ల సింహాల్ని పెద్దయ్యేదాకా బతకనిచ్చేందుకు ఇష్టపడవని వివరించారు. ఇలా, ఏనుగుల తీరుకు సంబంధించి ఓ కొత్త కోణం బయటకు రావడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Feb 16 , 2024 | 04:51 PM