ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..

ABN, Publish Date - Nov 22 , 2024 | 09:47 PM

బిడ్డను పోగొట్టుకుని కన్నీటి పర్యంతమవుతున్న ఓ ఆడ ఏనుగు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: సృష్టిలో ఏ బంధంలోనైనా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది.. ఒక్క తల్లి ప్రేమలో తప్ప! కడుపున పుట్టిన సంతానం బాగుండాలని కోరుకునే తల్లి తన ఆయుష్షును కూడా భగవంతుడు వారికే ఇవ్వాలని కోరుకుంటుంది. వారి బాగుకోసం అహరహం శ్రమిస్తుంది. బిడ్డల్ని కాపాడుకునేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. వారికేమైనా అయితే తట్టుకోలేక నరకం అనుభవిస్తుంది. బిడ్డను కడుపున మోసి కన్న ఏ ఆడ జీవికైనా బిడ్డలపై ఇదే భావన ఉంటుంది. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ ఆడ ఏనుగు వీడియో వైరల్ (Viral) అవుతోంది.

Viral: బ్రిటన్‌లో జాబ్ ఇంటర్వ్యూకు హాజరైన భారతీయ యువతికి షాకింగ్ అనుభవం!


పర్వీన్ కాస్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను షేర్ చేశారు. చనిపోయిన గున్న ఏనుగు మృ‌త దేహాన్ని చూసి తల్లి ఏనుగు తట్టుకోలేక తల్లడిల్లిపోయిన ఉదంతం ఇది. ‘‘తన బిడ్డ పోయిన విషయాన్ని ఆ తల్లి ఏనుగు అంగీకరించలేకపోతోంది. కొన్ని రోజులుగా గున్న ఏనుగు మృత దేహాన్ని ఈడ్చుకుంటూ తన వెంట తీసుకెళుతోంది. చాలా అంశాల్లో ఏనుగులు కూడా మనలాగే ప్రవర్తిస్తాయి. ఈ వీడియోను ఏడీఎస్ అధికారి జయంతా మొండల్ తీశారు. ఇలాంటి దృశ్యం అడవిలో చూడటం మాకు ఇదే తొలిసారి కాదు. నేను గతంలో ఇలాంటి ఉదంతాలు చూశాను. కొన్ని సందర్భాల్లో ఏనుగుల మంద మొత్తం.. పోయిన గున్న ఏనుగును ఇలా తమ వెంట తీసుకెళతాయి. చూడటానికి ఇదంతా అంత్యక్రియలు లాగా కనిపిస్తాయి’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Viral: దేవుడా! తను వాడిన కాటన్ బడ్స్ అమ్ముతూ భారీగా ఆర్జిస్తున్న మహిళ


ఇక ఈ వీడియో జనాలను కూడా అమితంగా కదిలించింది. ఫలితంగా ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ‘‘బిడ్డలపై తల్లి ప్రేమకు మించినది మరొకటి లేదు’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘‘ బిడ్డలపై తల్లి ఏనుగులకు ఎంతటి ప్రేమ ఉంటుందో ఈ ఉదంతం కళ్లకుకట్టినట్టు చూపిస్తోంది. జంతువులకు ఎటువంటి హాని తలపెట్టరాదని ఇది నేర్పిస్తోంది. అయితే, మనుషులకు మల్లేనే జంతువులు ఉంటాయని కూడా భావించకూడదు. వాటిమానాన వాటిని వదిలేయడమే మనుషుల కర్తవ్యం’’ అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ ఉదంతంపై మీరూ ఓ లుక్కేయండి.

Viral: భార్యను కలిసేందుకు 4.4 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర! ఇదో విచిత్ర ప్రేమ కథ!

Viral: వావ్.. టాటాల రూ.7 వేల కోట్ల ఆఫర్‌ను కాదన్న ఈమె ఎవరో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Nov 22 , 2024 | 09:56 PM