ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బురదలో ఇరుక్కుపోయిన ఖడ్గమృగాన్ని చుట్టుముట్టిన సింహాలు.. కాపాడేందుకు ఎంతో ప్రయత్నించిన ఏనుగు.. అయితే..

ABN, Publish Date - Jan 11 , 2024 | 06:34 PM

అడవికి సింహం రాజు అయినా.. కొన్ని కొన్ని జంతువుల జోలికి వెళ్లాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది. ప్రధానంగా ఏనుగులు, ఖడ్గమృగాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాయి. అయితే ..

అడవికి సింహం రాజు అయినా.. కొన్ని కొన్ని జంతువుల జోలికి వెళ్లాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది. ప్రధానంగా ఏనుగులు, ఖడ్గమృగాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాయి. అయితే కొన్నిసార్లు పరిస్థితి తారుమారై.. చివరికి సింహాలకు ఆహారమవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బురదలో ఇరుక్కుపోయిన ఖడ్గమృగంపై కొన్ని సింహాలు దాడి చేశాయి. తీరా చంపేసే సమయలో ఏనుగు ఎంటరవుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆఫ్రికాలోని ఎటోషా నేషనల్ పార్క్‌లో (Etosha National Park) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఖడ్గమృగం నీరు తాగే క్రమంలో పొరపాటున బురదలో చిక్కుకుపోతుంది. బయటికి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఇంతలో కొన్ని ఏనుగులు అక్కడికి వస్తాయి. వాటిలో ఓ పెద్ద ఏనుగు.. ఖడ్గమృగాన్ని కాపాడేందుకు ముందుకొస్తుంది. ఏనుగు రావడం చూసి సింహాలు అక్కడి నుంచి పరుగందుకుంటాయి. నీటి గుంటలోకి వెళ్లిన ఏనుగు.. ఖడ్గమృగాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తుంది. ఖడ్గమృగం భారీ జంతువు కావడంతో ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. అయినా ఏనుగు మాత్రం ఎలాగైనా దాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో కాళ్లు, తొండం ఉపయోగించి బయటికి నెట్టే ప్రయత్నం చేస్తుంది.

Viral Video: ఈ బామ్మ తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. చేతులతో అల్లిన స్వెట్టర్‌ను చిన్న ట్రిక్‌తో ఎలా మార్చిందంటే..

అయితే ఏనుగు ఎంత సేపు ప్రయత్నించినా ఖడ్గమృగాన్ని మాత్రం బయటికి తీయడం సాధ్యం కాదు. దీంతో చివరకు ‘‘సారీ ఫ్రెండ్.. నా వల్ల కాలేదు’’.. అన్నట్లుగా నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీన్ని గమనించిన సింహాలు మళ్లీ అక్కడికి వెళ్లి ఖడ్గమృగాన్ని చంపే ప్రయత్నం చేస్తాయి. అయితే ఈ సారి మాత్రం ఏనుగులు అక్కడికి రాకపోవడంతో సింహాలన్నీ ఖడ్గమృగాన్ని చుట్టుముడతాయి. ఈ వీడియో ఇంతటితో ముగిసినా చూస్తుంటే.. ఖడ్గమృగం వాటికి ఆహారమైనట్లు తెలుస్తోంది. అయితే, జంతువైనా సాటి జంతువును కాపాడాలని శతవిధాలా ప్రయత్నించిన ఏనుగును చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఏనుగును చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో పాపం! ఏనుగు కష్టం వృథా అయిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 81లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! ఇంతకీ ఇతను మనిషేనా.. దుప్పటి పైకి తీయగా.. లోపలి నుంచి ఏమొచ్చాయో చూడండి..

Updated Date - Jan 11 , 2024 | 06:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising