Elon Musk: నేను అప్పుడే చెప్పా.. కానీ నాకు మతి లేదని అన్నారు: ఎలాన్ మస్క్
ABN, Publish Date - Dec 10 , 2024 | 04:08 PM
నేటి ఇంటర్నెట్ విప్లవం గురించి మస్క్ 26 ఏళ్ల క్రితమే ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్ పుణ్యమా అని సంప్రదాయిక మీడియాలో అనేక మార్పులు వచ్చాయి. ఇంటర్నెట్ ఆలంబనగా అవతరించిన సోషల్ మీడియా ప్రజలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రత్యామ్నాయ వేదికగా మారింది. అయితే, ఈ విప్లవాత్మక మార్పులను 26 ఏళ్ల క్రితమే ఎలాన్ మస్క్ గుర్తించడమే కాకుండా మీడియా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. నాటి వీడియోను ఓ వ్యక్తి షేర్ చేయగా మస్క్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Elon Musk).
Viral: వామ్మో.. మనుషులను శుభ్రపరిచే వాషింగ్ మెషీన్!
సుమారు పాతికేళ్ల నాటి ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ఎలాన్ మస్క్ రాబోయే మార్పులను కళ్లకు కట్టినట్టు వివరించారు. ‘‘ఇంటర్నెట్ అన్ని మీడియాలను తనలో ఇముడ్చుకుంటుంది. మీడియాకు మొదలు, చివరగా మారుతుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, బ్రాడ్‌కాస్ట్, రేడియో ఇలా అన్నీ ఇంటర్నెట్‌లో విలీనమైపోతాయి. ప్రజలు తమ వద్ద సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉన్న ఓ ఇంటెలిజెంట్ మాధ్యమం ఇది. రేడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్.. ఇలా మీడియా ఏదైనప్పటికీ ఇంటర్నెట్‌తో ప్రజలకు తమకు నచ్చిన సమాచారాన్ని ఎంచుకునే స్వేచ్ఛ లభిస్తుంది. సంప్రదాయిక మీడియాలో ఇంటర్నెట్ కారణంగా విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’’ అని మస్క్ అప్పట్లో పేర్కొన్నారు. ఈ వీడియోపై మస్క్ తాజాగా స్పందించారు. ఈ మార్పులను ఊహించడం అంత కష్టమేమీ కాదని, అయితే, ఈ మాటలు అన్నందుకు అప్పట్లో తనను అందరూ మతిలేని వాడిగా చూశారని వ్యాఖ్యానించారు.
Viral: దేవుడా! ఈ ఒక్క ప్రశ్నకు యస్ చెప్పినందుకు 100 మంది ఉద్యోగులకు ఊస్టింగ్!
ప్రపంచంలో ఎక్కడి వార్త అయినా ప్రజల ముందుకు క్షణాల్లో తెచ్చే ప్రధాన సాధనంగా ప్రస్తుతం ఎక్స్ అవతరించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా సంక్షోభ సమయంలో ఎక్స్ (అప్పట్లో ట్విట్టర్) ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాల రాస్తోందని మస్క్ గగ్గోలు పెట్టారు. ఆ తరువాత కొన్నాళ్లకు దీన్ని చేజిక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో అమెరికాలో అనేక మంది సెలబ్రిటీలు ఎక్స్‌ను వీడుతున్నారు. ఎక్స్ నిబంధనల్లో మార్పులు, తప్పుడు సమాచారం వ్యాప్తి ఎక్కువైందంటూ కొందరు సినీతారలతో పాటు ఇతర రంగాల పలువురు ప్రముఖులు ఎక్స్‌ను వీడి ప్రత్యామ్నాయ వేదికలను ఎంచుకున్నారు.
Viral: బ్యాంకు మేనేజర్ దగా! లోన్ ఆశ పెట్టి రూ.39 వేల నాటు కోళ్లు స్వాహా!
Updated Date - Dec 10 , 2024 | 05:17 PM