StealToilet: బాయ్‌ఫ్రెండ్‌తో యువతి బ్రేకప్.. మరుసటి రోజు బాత్రూమ్లోకి వెళ్లి చూస్తే..
ABN, Publish Date - Mar 29 , 2024 | 05:44 PM
తనకు బ్రేకప్ చెప్పిన యువతిపై ఆమె బాయ్‌ఫ్రెండ్ ప్రతీకారం(Revenge) తీర్చుకున్న తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: తనకు బ్రేకప్ చెప్పిన యువతిపై ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ ప్రతీకారం(Revenge) తీర్చుకున్న తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. బ్రేకప్ చెప్పాక అతడు ఏం చేసిందీ చెబుతూ మాజీ గర్ల్ ఫ్రెండ్ పెట్టిన పోస్టు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ప్రముఖ చర్చావేదిక రెడిట్ ఆమె తన అనుభవాన్ని పంచుకుంది (Youth Steals girl friend's toilet).
‘‘నిన్న నేను నా బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ (Breakup) చెప్పా. అతడిని వెళ్లిపొమ్మని చెప్పా. అతడు తన సామాన్లు సద్దుకుంటుంటే నేనేమో నిద్రపోయా. మరుసటి రోజు లేచి చూసేసరికి బాత్రూమ్లో టాయ్‌లెట్ కనిపించలేదు. అతడు ఏకంగా నా టాయ్‌లెట్‌నే దొంగతనం చేశాడు. దీంతో, నేను ఆ పూటకు పొరుగున ఉన్న రెస్టారెంట్ బాత్రూమ్ను వాడుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ప్లంబర్‌ను పిలిస్తే అతడు వచ్చి కొత్త టాయ్‌లెట్ బిగించి వెళ్లాడు’’ అని యువతి చెప్పుకొచ్చింది.
థియేటర్లో సినిమా చూస్తున్న మహిళ.. ముందు సీట్లోని వ్యక్తి చిమ్మ చీకట్లో చేస్తున్నదేంటో చూసి..
ఇదంతా చదివిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. యువకుడి రివెంజ్ వింతగా ఉందని, పొట్టచెక్కలయ్యేలా నవ్వొస్తోందని కామెంట్ చేశారు. బాయ్‌ఫ్రెండ్‌తో పాటు టాయ్‌లెట్ కూడా దూరం కావడం కాస్త బాధ కలిగించే అంశమే అయినా బాగా నవ్వు తెప్పిస్తోందని అనేక మందిని కామెంట్ చేశారు.
కొందరేమో యువకుడిపై మండిపడ్డారు. మాజీ గర్ల్ ఫ్రెండ్‌పై ఎంత కోపంగా ఉంటే మాత్రం ఇలా చేయాలా అంటూ తిట్టిపోశారు. కనీసం, మూతనన్నా వదిలి వెళ్లలేదంటే అతడి సంస్కారం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది.
Spit Stains: ఈ మహిళ కష్టం చూసాకైన జనాల్లో మార్పొస్తుందా? నెటిజన్లను కలచివేస్తున్న వీడియో!
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 29 , 2024 | 06:05 PM