ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Winter: గీజర్ ను అదేపనిగా వాడేస్తున్నారా.. ఈ అజాగ్రత్తలు మీ ప్రాణాలే తీసేయొచ్చు.. బీ అలర్ట్..

ABN, Publish Date - Jan 10 , 2024 | 12:37 PM

కొన్ని రోజుల క్రితం.. స్నానానికి నీళ్లు వేడి చేయాలంటే కట్టెల పొయ్యి వాడేవారు. కొన్నాళ్ల తర్వాత ఎలక్ట్రిక్ హీటర్లు వచ్చాయి.

కొన్ని రోజుల క్రితం.. స్నానానికి నీళ్లు వేడి చేయాలంటే కట్టెల పొయ్యి వాడేవారు. కొన్నాళ్ల తర్వాత ఎలక్ట్రిక్ హీటర్లు వచ్చాయి. రోజులు గడుస్తున్న కొద్దీ సాంకేతికత మారుతున్న కొద్దీ.. హీటర్ల స్థానంలో గీజర్లు వచ్చేశాయి. ప్రస్తుతం చాలా ఇళ్లలో ఎలక్ట్రిక్ గీజర్లను ఉపయోగిస్తున్నారు. ఈ గీజర్ల వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే నష్టాలూ ఉన్నాయి. అయితే.. గీజర్ ఉపయోగించి స్నానం చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న పొరపాటు చేసినా.. ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తు్న్నారు. గీజర్ బటన్‌ను ఆన్ లో ఉంచడం వల్ల గీజర్ వేడెక్కి పగిలిపోయే ప్రమాదం రావచ్చు. స్నానం చేసేటప్పుడు గీజర్‌ను ఆన్‌లో ఉంచితే దాని ఒత్తిడి బాయిలర్‌పై పడుతుంది. ఇది గీజర్‌లో లీకేజీ సమస్యకు కారణమవుతుంది. గీజర్ వైర్ రాగితో చేయకపోయినా అది పేలొచ్చు. తీగల్లో విద్యుత్ ప్రవహించి.. కరెంట్ షాక్ కు దారి తీయవచ్చు.

దాదాపు అన్ని గీజర్లలో ఆటోమేటిక్ హీట్ సెన్సార్లు ఉన్నాయి. ఒకవేళ ఈ సెన్సార్లు పనిచేయడం మానేస్తే గీజర్ పేలిపోయే అవకాశాలు ఎక్కువ. గీజర్‌లో ఇన్‌స్టాల్ చేసిన కాయిల్ వేడిగా ఉంటే షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. అనుభవజ్ఞుడైన ఎలక్ట్రీషియన్ ద్వారా మాత్రమే గీజర్‌ను ఇన్‌స్టాల్ చేయించుకోవాలి. గీజర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. వెంటిలేషన్ వచ్చే ప్రదేశంలో ఉంచాలి. స్నానం చేస్తున్నప్పుడు గీజర్‌ను రన్నింగ్‌లో ఉంచవద్దు. గీజర్‌లో నీటి స్థాయి కనీసం 1/3 ఉండాలి. తడి చేతులతో తీగను తాకకూడదు. గీజర్‌ను మళ్లీ మళ్లీ ఆన్, ఆఫ్ చేయవద్దు.


గీజర్ పై ఎలాంటి బరువైన వస్తువును ఉంచవద్దు. మంటలు వేయవద్దు. గీజర్ చాలా త్వరగా మంటలను అంటుకుంటుంది. శీతాకాలంలో గీజర్ ఉష్ణోగ్రత 60 నుంచి 65 డిగ్రీల వద్ద ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సెట్టింగ్‌ను 50 డిగ్రీల కంటే తగ్గించవద్దు. వేసవి కాలంలో 50 నుంచి 55 డిగ్రీల వద్ద గీజర్‌ను సెట్ చేసుకోవచ్చు. మీ చిన్నపాటి అజాగ్రత్త వల్ల మీకు మరియు మీ కుటుంబానికి భారీగా నష్టం వాటిల్లుతుందని గమనించండి. కాబట్టి ఏదైనా విద్యుత్ పరికరాన్ని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండండి.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 12:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising