మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో

ABN, Publish Date - Apr 06 , 2024 | 03:49 PM

తన పొలంలోకి వచ్చిన చిరుతతో ఓ రైతు సెల్ఫీ దిగిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: చిరుత..అత్యంత క్రూర మృగాల్లో ఇదీ ఒకటి. దానితో పెట్టుకుంటే మరణాన్ని రెండు చేతులతో ఆహ్వానించినట్టే. కానీ, ఓ రైతు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. పొలంలోకి చిరుత వచ్చిందని తెలిసి అతడు చేసిన పని చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తన పొలంలో చిరుత ప్రవేశించిందని తెలుసుకున్న ఓ రైతు అక్కడికెళ్లాడు. అతడు వెళ్లే సమయానికి చిరుత అక్కడే ఉంది. దాన్ని చూసి పారిపోవాల్సిన రైతు విచిత్రంగా చిరుత వద్దకు వెళ్లి సెల్ఫీ దిగాడు. రకరకాల పోజుల్లో రెండు మూడు సెల్ఫీలు దిగాడు. ఇక చిరుత కూడా వింతగానే ప్రవర్తించింది. రైతును చూసి పారిపోవడమో లేక దాడి చేయడమో కాకుండా అక్కడే సైలెంట్‌గా కూర్చుంది. అతడి సెల్ఫీలు తీసుకుంటుంటే అది తోకాడిస్తూ పోజులిచ్చింది (Farmer takes selfie with leopard).

Viral: రోజూ పడవలో ఒంటరిగా ప్రయాణిస్తున్న కుక్క .. అసలేం జరుగుతోందని ఆరా తీస్తే..


ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ నెట్టింట మాత్రం పెను సంచలనంగా మారింది. లక్షల కొద్దీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇక జనాలైతే కామెంట్ల వర్షం కురిపించారు. రైతు చిరుతకే షాకిచ్చాడంటూ అనేక మంది కామెంట్ చేశారు. తనను చూసి భయపకుండా సెల్ఫీ దిగుతున్న రైతును చూసి చిరుత ఆశ్చర్యపోయి ఉంటుందని కొందరు అన్నారు. తనను చూసి వణికిపోవాల్సిన వ్యక్తి ఇలా నిర్భీతిగా వ్యవహరిస్తుండటంతో బిత్తరపోయి అలా కదలకుండా ఉండిపోయిందని కామెంట్ చేశారు. రైతు అదృష్టం బాగుండబట్టి సరిపోయింది కానీ లేకపోతే ప్రాణాలు పోయేవే అని కొందరు అన్నారు. ఇలాంటి పనులతో రిస్క్‌లో పడొద్దని కొందరు అన్నారు. నెటిజన్లు షేక్ చేస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ మారు లుక్కేయండి!

Viral: షాకింగ్.. ఎంత పని చేసిందీ గంగిరెద్దు! సైలెంట్‌గా కనిపిస్తూనే ఒక్కసారిగా..

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2024 | 03:59 PM

Advertising
Advertising