ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..

ABN, Publish Date - Oct 03 , 2024 | 11:13 AM

అంతరిక్షం నుంచి దూకిన ఓ సాహసికుడు ధ్వనికి మించిన వేగంతో భూమివైపునకు దూసుకొచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2012లో నిర్వహించిన ఈ సాహస క్రీడ తాలూకు వీడియో నెట్టింట మరోసారి వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: విమానాలు, బెలూన్ల నుంచి పారాషూట్ల సాయంతో సాహసికులు కిందకు దూకడం మనం చూసే ఉంటాం. దీన్ని స్కైడైవింగ్ అంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అంతరిక్షం నుంచి కిందకు దూకాలనుకున్నాడు. ఆ తరువాత ఆరేళ్లు కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు. ఈ క్రమంలో ధ్వని కంటే ఎక్కువ వేగంతో భూమివైపు ప్రయాణించి సరికొత్త రికార్డు కూడా సృష్టించాడు. ఈ చారిత్రాత్మక ఘటన జరిగి దాదాపు 12 ఏళ్లు కాగా నాటి వీడియో మరోసారి వైరల్ అవుతోంది. కనీవినీఎరగని సాహనం చేసిన ఆ వ్యక్తి పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది (Viral).

Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..


ఆస్ట్రియాకు చెందిన ఫీలిక్స్ బామ్‌గార్ట్నర్‌ అప్పటికే ఎన్నో సాహస క్రీడలు చేశారు. పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాల నుంచి అనేక మార్లు దూకి బేస్ జంపింగ్ చేసిన అతడికి చివరకు విసుగు వచ్చేసింది. దీంతో, అంతరిక్షం నుంచి దూకితే ఎలా ఉంటుందో అన్న ఆలోచన వచ్చింది. రాను రాను అది బలపడి చివరకు ఆ సాహసం చేయడానికి అతడు సిద్ధమయ్యాడు. అతడి సాహసకృత్యానికి ప్రముఖ రెడ్ బుల్ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఓ మాజీ కల్నల్ మార్గనిర్దేశకుడిగా నిలిచారు. అలా ఉద్దండులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ సాహసంలో ఫీలిక్స్‌కు అనువైన స్పేస్ సూట్ సిద్ధం చేయడం వారికి పెను సవాలుగా మారింది. రెండేళ్లల్లో పూర్తవుతాయనుకున్న ఏర్పాట్లు ఓ కొలిక్కి వచ్చేందుకు ఏకంగా ఆరేళ్లు పట్టింది. చివరకు స్పేస్ డైవింగ్ సాహసానికి 2012 అక్టోబర్ 14న ముహూర్తం ఖరారు చేశారు.

Viral: వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా?

ఆ రోజు ఫీలిక్స్.. హీలియమ్ బెలూన్ సాయంతో స్ట్రాటోస్‌ఫియర్‌‌కు చేరుకున్నారు. దీనికి దాదాపు రెండున్నర గంటలు పట్టింది. భూమ్మీద నుంచి 30 కిలోమీటర్ల ఎత్తున స్ట్రాటోస్ఫియర్ అనే పొర మొదలవుతుంది. అత్యల్ప పీడనం, ఉష్ణోగ్రతలు ఉంటాయి. అంటే.. ఇది దాదాపు ఆకాశం అంచు అన్నమాట. ఆ తరువాత ఇక అంతా అంతరిక్షమే. ఇక హీలియం బెలూన్ క్యాప్సుల్ 38,969 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాక ఫీలిక్స్ కిందకు దూకాడు. తొలి నాలుగు నిమిషాలు అతడు నేరుగా భూమివైపు దూసుకొచ్చాడు. పారాషూట్ తెరవలేదు. దీంతో, ఒకానొక సమయంలో అతడి వేగం గంటకు 1357 కిలోమీటర్లకు చేరుకుంది. వాతావరణంలోకి ప్రవేశించాక అతడు పారాషూట్ తెరిచాడు. దీంతో, అతడి వేగం క్రమంగా తగ్గింది. మరో నాలుగు ఐదు నిమిషాలకు అతడు పారాషూట్ సాయంతో సురక్షితంగా భూమికి చేరుకున్నాడు.

UP: క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్ ఆర్డర్! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక..


అంతకుముందు ఎవరూ చేయని సాహసాన్ని చేయడంతో ఫీలిక్స్‌ను పలు గిన్నిస్ రికార్డులు కూడా వరించాయి. ఎటువంటి విహంగాలు లేకుండానే ధ్వని కంటే ఎక్కువ వేగంగో ప్రయాణించిన తొలి వ్యక్తిగా అతడు రికార్డు నెలకొల్పాడు. అత్యంత ఎత్తు నుంచి భూమ్మీదకు దూకిన వ్యక్తిగా నిలిచాడు. అప్పట్లోనే ఈ సాహస క్రీడ యూట్యూబ్‌లో లైవ్‌లో ప్రసారమైంది. వీక్షకుల తాకిడికి యూట్యూబ్ తట్టుకోలేకపోయింది. నాటి వీడియో తాజాగా మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. నాడు ఈ సాహసక్రీడను ప్రత్యక్షంగా చూసిన వారందరూ ఆ దృశ్యాల్ని తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్య వేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే, ఫీలిక్స్ రికార్డును ఆ తరువాత గూగుల్ ఉద్యోగి ఆలన్ యూస్టేస్ అధికమించారు. 41,422 మీటర్ల ఎత్తు నుంచి దూకి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

Viral: స్ఫూర్తి రగిలించే గెద్ద వీడియో.. ఆనంద్ మహీంద్రా కామెంట్స్ వైరల్!

Read Latest and Viral News

Updated Date - Oct 03 , 2024 | 11:29 AM