ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పాము, ముంగిస మధ్య వెరైటీ ఫైట్.. చివరకు ముంగిస చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..

ABN, Publish Date - Jan 03 , 2024 | 05:08 PM

పామును బద్ధశత్రువు ఎవరు అని అడిగితే.. టక్కున ముంగిస పేరే గుర్తుకొస్తుంది. పాము కనిపిస్తే చాలు ముంగిస వెంటబడి మరీ దాడి చేస్తుంది. పాము, ముంగిస పోరాటంలో చాలాసార్లు ముంగిసే విజయం సాధిస్తుంటుంది. అయితే...

పామును బద్ధశత్రువు ఎవరు అని అడిగితే.. టక్కున ముంగిస పేరే గుర్తుకొస్తుంది. పాము కనిపిస్తే చాలు ముంగిస వెంటబడి మరీ దాడి చేస్తుంది. పాము, ముంగిస పోరాటంలో చాలాసార్లు ముంగిసే విజయం సాధిస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ముంగిసలు కూడా పాముల దాడిలో ప్రాణాలు కోల్పోతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా.. పాము, ముంగిస మధ్య జరిగిన ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పాము, ముంగిస మధ్య వెరైటీ ఫైట్ జరిగింది. చివరకు ముంగిస చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్ (Gujarat) అమ్రేలి జిల్లా తులసిష్యం పరిధిలోని హనుమాన్ తపా గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పైకి వచ్చిన నాగుపాము పక్కనే ఉన్న ఇంటికి సమీపంలోని చెట్లపొదల్లోకి వెళ్లే క్రమంలో సడన్‌గా ముంగిస కంటపడుతుంది. పామును చూడగానే (mongoose attacking on snake) ముంగిస దాడికి దిగుతుంది. పరుగు పరుగున వచ్చి పాముపై ఎటాక్ చేస్తుంది. పాము కూడా ముంగిసను కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ముంగిస చాలా తెలివిగా పాము నుంచి తప్పించుకుంటూ ఉంటుంది.

Rare Bird: ఆ రెండు లక్షణాలూ ఉన్న అత్యంత అరుదైన పక్షి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

మధ్యలో ఓసారి పాము తలను పట్టుకుని కొరికే ప్రయత్నం చేస్తుంది. ఇలా వాటి మధ్య చాలా సేపు పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే మధ్యలో ఏమనుకుందో ఏమో గానీ.. ముంగిస తన పోరాటాన్ని సడన్‌గా ముగిస్తుంది. ‘‘ప్రాణాలతో వదిలేస్తున్నా.. బతుకుపో..’’ అన్నట్టుగా పామును వదిలేసి వెళ్లిపోతుంది. అప్పటికే అలసిపోయిన పాము.. బతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనను స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనసు మార్చుకున్న ముంగిస’’.. అంటూ కొందరు, ‘‘పాము టైమ్ బాగుంది’’.. అంటూ మరికొందరు, ‘‘వామ్మో! ఈ ఫైట్ చాలా విచిత్రంగా ఉందే’’. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Elephant: తప్పిపోయిన పిల్ల ఏనుగును తల్లి వద్దకు చేర్చగానే.. ఫారెస్ట్ సిబ్బందికి కనిపించిన అరుదైన దృశ్యం..

Updated Date - Jan 03 , 2024 | 05:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising