ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: రిఫండ్ ఇచ్చినా ఫ్లిప్‌కార్ట్‌ను వదిలిపెట్టని కోర్టు.. కస్టమర్‌ను వేధించినందుకు భారీ షాక్!

ABN, Publish Date - Mar 17 , 2024 | 05:09 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసర్ ఫారోమ్ భారీ షాకిచ్చింది. కస్టమర్‌ను మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.10 వేల పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.

ఇంటర్నెట్ డెస్క్: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఫారోమ్ భారీ షాకిచ్చింది. కస్టమర్‌ను మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.10 వేల పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. 2022లో జరిగిన ఈ కేసులో గత నెలలో కోర్టు తీర్పు వెలువరించగా ఇందుకు సంబంధించిన పూర్తి కాపీలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి.

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..

ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం, దాదర్ ప్రాంతానికి చెందిన అతడు 2022 జులై 10న రూ.39,628 పెట్టి ఐఫోన్ (IPhone) ఆర్డరిచ్చాడు. ఆ తరువాత ఆరు రోజులకు ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటూ ఫ్లిప్‌కార్ట్ సందేశం పంపించింది. దీంతో, కస్టమర్ ప్లిప్‌కార్టను సంప్రదించాడు. ఏం జరిగిందని ప్రశ్నించాడు. డెలివరీ సంస్థ ఎకార్ట్‌కు చెందిన ఏజెంట్ ఐఫోన్ ఇచ్చేందుకు కస్టమర్‌ను కాంటాక్ట్ అయ్యేందుకు పలు మార్లు ప్రయత్నించినా అతడు అందుబాటులో లేక పోవడంతో ఆర్డర్ క్యాన్సిల్ (Order Cancelled) అయినట్టు చెప్పుకొచ్చింది. దీనివల్ల తాను చాలా నష్టపోయానంటూ కస్టమర్ ఫిర్యాదు చేశాడు.

Viral: థాయ్‌లాండ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన భారతీయులు.. అమ్మో..మనోళ్లు మామూలుగా లేరుగా..


అయితే, ఫ్లిప్‌కార్ట్ మాత్రం అతడి వాదనలను తోసిపుచ్చింది. తాము కేవలం ఆన్‌లైన్ వేదిక మాత్రమేనని చెప్పుకొచ్చింది. తాము ఐఫోన్ అమ్మినట్టు కస్టమర్ పొరపడ్డాడని చెప్పుకొచ్చింది. కస్టమర్‌కు, అమ్మకందారుకు తాము మధ్యవర్తిగా మాత్రమే సేవలందిస్తామని వివరించింది. కస్టమర్ ఫిర్యాదును అమ్మకందారుకు చేర్చామని, అతడికి రిఫండ్ కూడా ముట్టిందని చెప్పుకొచ్చింది. ఏదైనా వివాదం ఉంటే అది బయ్యర్, సెల్లర్ మధ్యేనని తేల్చి చెప్పింది.

Viral: ట్రాఫిక్‌లో యువతిని అదేపనిగా ఫాలో అయిన ఆటోవాలా.. ఆమె స్కూటీ ఆగిపోగానే ఊహించని విధంగా..

కానీ, డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ మాత్రం ఫ్లిప్‌కార్ట్ వాదనలు తోసిపుచ్చింది. ఆర్డర్ విషయమై కస్టమర్ ఫ్లిప్‌కార్టుతో సంప్రదింపులు జరుపుతుండగానే ఏకపక్షంగా ఆర్డర్ క్యాన్సిల్ చేసిందని చెప్పింది. అంతేకాకుండా, కస్టమర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలమైనట్టు ఆధారాలు ఏవీ చూపించలేకపోయిందని కోర్టు తెలిపింది. ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి ఆ తరువాత ఫ్రెష్ ఆర్డర్ పెట్టమని కూడా ఫ్లిప్‌కార్ట్ సూచించడాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. కానీ అప్పటికే ఐఫోన్ ధర రూ.7వేలు పెరిగింది కాబట్టి అదనపు లాభాల కోసం కావాలనే ఫ్లిప్‌కార్ట్ అనైతిక చర్యకు పాల్పడ్డట్టు భావంచాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్ ఫ్రాడ్ జరిగిందన్న కస్టమర్ ఆరోపణలకు ఈ పరిణామం బలం చేకూర్చుతుందని అభిప్రాయపడింది. ఇదంతా సేవా లోపం కిందకు వస్తుందన్న కోర్టు.. కస్టమర్‌కు కలిగిన మానసిక వేదనకు పరిహారంగా ఫ్లిప్‌కార్ట్ రూ.10 వేలు చెల్లించాలని (Rs. 10,000 Compensation) తీర్పు వెలువరించింది.

Viral: దోశ ఆర్డరిచ్చిన మహిళకు భారీ షాక్.. రెండు ముక్కలు తిన్నాక డౌటొచ్చి కిందకు చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 05:16 PM

Advertising
Advertising