ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్‌లో అధికంగా ధరలు! ఫ్లిప్‌కార్ట్‌పై గుస్సా!

ABN, Publish Date - Nov 01 , 2024 | 01:13 PM

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై ఓ వినియోగదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల్లో ఒకే వస్తువు ధర వేర్వేరుగా ఉందని, యాపిల్ వినియోగదారులకు అధిక ధర ఖరారు చేశారంటూ మండిపడ్డారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై ఓ వినియోగదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల్లో ఒకే వస్తువు ధర వేర్వేరుగా ఉందని, యాపిల్ వినియోగదారులకు అధిక ధర ఖరారు చేశారంటూ మండిపడ్డారు. ఈ మేరకు సౌరభ శర్మ అనే నెటిజన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ (viral) అవుతోంది.

Viral: పాపం.. వధువు! నలుగురి ముందు వరుడు చేసిన పనికి..


మోకొబారా సూట్‌కేసు ధర ఫ్లిప్‌కార్ట్ ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్‌లో వేర్వేరుగా ఉందని సౌరభ స్క్రీన్ షాట్స్ షేర్ చేశాడు. ఆ సూట్‌కేసు ధర యాండ్రాయిప్ యాప్‌లో రూ.4119గా ఉందని, అదే ఐఓఎస్ ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో మాత్రం రూ.4779గా ఉందని చెప్పుకొచ్చాడు. సబ్‌స్క్రిప్షన్‌లపై యాపిల్ 30 శాతం కమిషన్ తీసుకుంటుందని కాబట్టి ఆ విషయంలో అధిగ చార్జీలను అర్థం చేసుకోవచ్చు గానీ ఈకామర్స్ విషయంలో దీన్ని ఆమోదించలేమని అన్నాడు. ఇందులో ఏదో అనుమానాస్పదంగా అన్యాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Viral: ఈ ఆటోవాలా కోహినూర్ వజ్రం!

అతడు షేర్ చేసిన స్క్రీన్ షాట్స్ ప్రకారం మోకోబారా సూట్‌కేసు ధర ఆండ్రాయిడ్ యాప్‌లో 65 శాతం డిస్కౌంట్ కలుపుకుని రూ.4119గా నిర్ణయించారు. ఐఓఎస్ యాప్‌లో మాత్రం డిస్కౌంట్ 60 శాతంగా ఉంది. అంతేకాకుండా, ఆండ్రాయిడ్ వినియోగదారులకు నెలకు రూ.1373 చొప్పున నోకాస్ట్ ఈఎమ్ఐ అందుబాటులో ఉంటే ఐఓఎస్ యాప్‌లో మాత్రం ఈఎమ్ఐ నెలకు రూ.1600 గా నిర్ణయించారు.

Viral: అమెరికన్ పాప్ స్టార్‌ను ‘జై శ్రీరామ్’ అనాలని కోరిన భారతీయ అభిమాని!


ఇక ఈ ఉదంతంపై ఫ్లిప్‌కార్ట్ తనకు రిప్లై ఇచ్చినట్టు కూడా సౌరభ మరో పోస్టులో తెలిపాడు. ఫ్లిప్‌కార్ట్ వేదికపై రిజిస్టర్ అయిన సెల్లర్ల బట్టి ఆయా వస్తువుల ధరలు నిర్ణయమవుతాయని చెప్పినట్టు వెల్లడించారు.

కాగా ఈ ఏడాది ఆగస్టులో స్పీకర్ల ఆర్డరిచ్చిన ఓ కస్టమర్‌కు భారీ షాక్ తగిలింది. అతడు ఆర్డరిచ్చినవి కాకుండా తక్కువ ధర మీ బ్లూటూత్ స్పీకర్లు రావడంతో తీవ్ర నిరాశకులోనయ్యాడు. బాధిత కస్టమర్ ఎదుర్కొన్న ఇబ్బందిని అతడి స్నేహితుడు నెట్టింట పంచుకున్నాడు. రూ.30 వేల విలువైన సోనోస్ స్పీకర్లు ఆర్డరిస్తే రూ.2400ల మీ స్పీకర్లు వచ్చినట్టు ఫిర్యాదు చేశాడు. తప్పు జరిగినట్టు కస్టమర్ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నా ఫ్లిప్‌కార్ట్ ఫిర్యాదు పట్టించకోలేదని అప్పట్లో అతడు ఆక్రోశం వెళ్లగక్కాడు.

Read Latest and Viral News

Updated Date - Nov 01 , 2024 | 01:13 PM