Viral: ఇదేం పైత్యం దేవుడా! డిప్రెషన్‌లో ఎలుగుబంటి! సెల్ఫీ కోసం జనాల ఆరాటం!
ABN, Publish Date - Jul 20 , 2024 | 09:36 PM
ఎలుగుబంటి డిప్రెషన్‌లో ఉంటే జనాలు సెల్ఫీల కోసం ఎగబడుతున్న దారుణ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. జాలీ దయా లేని జనాల తీరుతో విసిగిపోతున్న ఎలుగును కాపాడేందుకు పోలీసులు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎలుగుబంటి డిప్రెషన్‌లో ఉంటే జనాలు సెల్ఫీల కోసం ఎగబడుతున్న దారుణ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. జాలీ దయా లేని జనాల తీరుతో విసిగిపోతున్న ఎలుగును కాపాడేందుకు పోలీసులు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. దాన్ని ఇబ్బంది పెట్టొద్దంటూ సోషల్ మీడియాలో స్థానికులను అభ్యర్థించాల్సి వచ్చింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది (Viral).
Viral: భార్యపై ప్రేమ.. రోజూ 320 కిలోమీటర్ల ప్రయాణిస్తున్న కొత్త పెళ్లికొడుకు!
వాల్టన్ కౌంటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఓ ఎలుగు అడవిలోంచి బయటకు వచ్చిన రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టు పక్కన కూర్చుడిపోయింది. దాని విషణ్ణ వదనం చూస్తే ఏదో తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎలుగు వాలం చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు కనీస విచక్షణ లేకుండా దాన్ని సమీపించి సెల్పీ దిగారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో మరింత మంది అక్కడికి క్యూకట్టారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న ఎలుగుకు ఈ తీరు విసుగు తెప్పించింది. ఇంత జరుగుతున్నా కనీసం తిరగబడలేని నిస్సహాయ స్థితిలో ఎలుగు ఉండిపోయింది. చివరకు విషయం పోలీసుల దాకా వెళ్లింది (Florida Cops Urge Locals To Stop Taking Selfies With Depressed Bear).
ఈ క్రమంలో పోలీసులు స్థానికులకు కీలక సూచన చేశారు. ఎలుగు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోందని హెచ్చరించారు. దానితో సెల్ఫీలకు ప్రయత్నించి అపాయడంలో పడొద్దని హెచ్చరించారు. కాస్త మానవత్వం ప్రదర్శిస్తూ దాని మానాన దాన్ని వదలిలేయాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందిందని, దాని బాగోగులు చూసుకునేందుకు వారు వస్తున్నారని చెప్పారు. అప్పటివరకూ ఎలుగును ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. పోలీసులు ఇలా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి రావడంతో ఈ ఉదంతం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Updated Date - Jul 20 , 2024 | 09:37 PM