USA: దారుణం.. పెంపుడు కుక్కను ఉసిగొల్పి మాజీ బాయ్‌ఫ్రెండ్ కూతురి హత్య!
ABN, Publish Date - Sep 01 , 2024 | 12:07 PM
అమెరికాలో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళ తన పెంపుడు కుక్కను ఉసి గొల్పి మాజీ బాయ్‌ఫ్రెండ్ కూతురిని హత్య చేసింది. ఫ్లోరిడాలో జూన్ 17న ఈ దారుణం వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో (USA) దారుణం వెలుగు చూసింది. ఓ మహిళ తన పెంపుడు కుక్కను ఉసి గొల్పి మాజీ బాయ్‌ఫ్రెండ్ కూతురిని హత్య చేసింది. ఫ్లోరిడాలో జూన్ 17న ఈ దారుణం వెలుగు చూసింది.
Viral: ఈమె ఇలా తయ్యారయ్యిందేంటి! చివరకు యోగాను కూడా అవమానించిందిగా..
స్థానిక మీడియా కథనాల ప్రకారం, టైషేల్ ఎలీస్ మార్టిన్ (34) ఆమె బాయ్‌ఫ్రెండ్ లోజాన్ సెషన్స్‌కు తరచూ గొడవలు జరుగుతుండటంతో అతడు విడిగా ఉంటున్నాడు. కాగా, టైషేల్ ఇటీవల పోలీసులకు ఫోన్ చేసి లోజాన్ కూతురు అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవస సిబ్బంది.. రక్తపు మడుగులో ఉన్న బాలికను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఆమె ఒంటిపై పలు చోట్లు గాయాలు కనిపించాయి. ఆ రోజు ఉదయమే చిన్నారికి కాలిఫోర్నియాకు తీసుకెళ్లా్ల్సి ఉండగా ఈ ఘోరం జరిగిందని టైషేల్ పోలీసులకు చెప్పింది (Florida woman ordered her Rottweiler to attack and maul nine year old girl to death).
మరోవైపు, కూతురి మరణం చూసి లోజాన్ షాకైపోయాడు. ఆమె కాలిఫోర్నియాలో ఉందనుకున్నానని పోలీసులకు తెలిపాడు. ఇంత ఘోరం జరుగుతుందని అస్సలు ఊహించలేదన్నాడు. జూన్ 9నే తన కూతురును టైషేల్ టూర్‌పై తీసుకెళుతున్నట్టు మెసేజీ పంపిందన్నాడు. ఈ క్రమంలో పోలీసులు ఇంటిలోని సెక్యూరిటీ కెమెరాను పరిశీలించగా జరిగిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. ఘటనకు రెండు రోజుల ముందు మార్టిన్.. రాట్‌వైలర్ అనే ప్రమాదకర జాతికి చెందిన తన పెంపుడు కుక్కను చిన్నారిపై ఉసిగొల్పుతున్నట్టు రికార్డయ్యాయి. ఆ తరువాత ఆమె బాలిక మృతదేహాన్ని గదిలో ఈడుస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి. చిన్నారిని అంతమొందించేందుకు సిద్ధమవుతున్నా అంటూ టైషేల్ వీడియోలో అన్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు.
చిన్నారిపై తరచూ దాడులు జరిగేవన్న విషయం కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఆమె ఒంటిపై పలు గాయాలను గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు బుధవారం టైషేల్‌ను అరెస్టు చేశారు. ఫస్ట్ డిగ్రీ మర్డర్, చిన్నాలపై వేధింపులు, నిర్లక్ష్యం తదితర అభియోగాలు మోపారు. లేక్ కౌంటీ జైలుకు తరలించారు.
Updated Date - Sep 01 , 2024 | 12:21 PM