ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫుడ్‌ - న్యూట్రిషన్‌.. చింతపండులో ఏం ఉంది?

ABN, Publish Date - Sep 01 , 2024 | 10:27 AM

చింతకాయలూ, చింతపండు, రెండింటినీ ఆహారంలోనూ, కొన్ని రకాల చికిత్సలలోను, కొన్ని రకాల వస్తువులను శుభ్రం చేేసందుకు కూడా వాడతాం. భారత ఉపఖండంలోనే కాక ఆసియాలోని వేరే దేశాల్లోనూ, మధ్యప్రాచ్య (మిడిల్‌ ఈస్ట్‌) దేశాల్లో, మెక్సికో, కరీబియన్‌ ప్రాంతాల్లో కూడా వీటిని వాడతారు.

చింతపండును రకరకాల వంటకాల్లో వాడతాం. కేవలం రుచికోసమేనా లేదా ఏవైనా పోషకవిలువలుంటాయా?

- శైలజ, ఖమ్మం

చింతకాయలూ, చింతపండు, రెండింటినీ ఆహారంలోనూ, కొన్ని రకాల చికిత్సలలోను, కొన్ని రకాల వస్తువులను శుభ్రం చేేసందుకు కూడా వాడతాం. భారత ఉపఖండంలోనే కాక ఆసియాలోని వేరే దేశాల్లోనూ, మధ్యప్రాచ్య (మిడిల్‌ ఈస్ట్‌) దేశాల్లో, మెక్సికో, కరీబియన్‌ ప్రాంతాల్లో కూడా వీటిని వాడతారు. జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఎక్కువగా వాడతారు. వికారం, అరుచి, అజీర్తి తగ్గించేందుకు చింతకాయలూ, చింతపండు ఉపయోగపడతాయి. దెబ్బల్ని త్వరగా నయం చేేసందుకు చింత చెట్టు బెరడును కూడా వాడతారు. చింతకాయ, చింతపండులోని పాలీఫీనాల్స్‌ యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి.


చింతలోని టార్టారిక్‌ ఆమ్లం వల్ల దానికి ఆ పులుపు రుచి వస్తుంది. ఈ ఆమ్లం తీవ్రత అధికమైతే మాత్రం జీర్ణాశయ సమస్యలు రావచ్చు. ఈ ఆమ్లగుణం వల్ల చింతపండు లేదా గుజ్జు కొన్ని రకాల ఆహారపదార్థాలను నిల్వ ఉంచేందుకు ఉపయోగపడుతుంది. పరిమిత మోతాదులో తీసుకున్నప్పుడు చింతకాయ, చింతపండు రెండూ ఆరోగ్యానికి ఉపయోగకరమైనవే. ఎక్కువ పులుపు తీసుకుంటే దంతాలపై ఎనామెల్‌ దెబ్బతింటుంది. కొన్ని బీ విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషక పదార్థాలున్నప్పటికీ మనం తీసుకునే పరిమాణంలో అవి ఎక్కువగా ఉండవు.


నాకు నలభై ఏళ్ళు. కాళ్ళ బొటన వేళ్ళు కీళ్ల వద్ద నొప్పులు ఉంటున్నాయి. రక్త పరీక్షల్లో యూరిక్‌ యాసిడ్‌ అధికంగా ఉందని తేలింది. ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

- కరీముద్దీన్‌, హైదరాబాద్‌

రక్తంలో యూరిక్‌ ఆసిడ్‌ ఎక్కువ ఉండడాన్ని ‘హైపర్‌ యూరిసీమియా’ అంటారు. మనం తీసుకునే ఆహారం, శరీరంలో జరిగే రకరకాల జీవప్రక్రియల ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే ప్యూరీన్లు అనే పదార్థాలు యూరిక్‌ యాసిడ్‌ గా మారతాయి. ఈ యూరిక్‌ యాసిడ్‌ నే వ్యర్థ పదార్థంగా కిడ్నీలు యూరిన్‌ లేదా మూత్రం రూపంలో విసర్జిస్తాయి. యూరిక్‌ యాసిడ్‌ విసర్జన సరిగా లేనపుడు రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ పెరిగి అవి క్రిస్టల్స్‌ గా మారే అవకాశం ఉంది. యూరిక్‌ యాసిడ్‌ అధికంగా ఉన్నప్పుడు కొంత మందిలో గౌట్‌ అనే వ్యాధి వస్తుంది.


కొన్ని సార్లు కిడ్నీల్లో యూరిక్‌ యాసిడ్‌ రాళ్లు చేరే అవకాశం ఉంది. యూరిక్‌ యాసిడ్‌ తగ్గించుకోవాలంటే ప్యూరీన్స్‌ అధికంగా ఉండే మాంసాహారం, చేపలు, ఆల్కహాల్‌ లాంటివి పూర్తిగా మానేయాలి. నీళ్లు తగినంత తీసుకోవడం, వాపు తగ్గ్గించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల యూరిక్‌ యాసిడ్‌ నియంత్రణలో ఉంచుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు రోజూ తీసుకోవాలి. ప్రొటీన్‌ కోసం మాంసాహారం బదులుగా గుడ్లు, పప్పు ధాన్యాలు, పాలు, పెరుగు, పనీర్‌ వంటివి తీసుకోవచ్చు. సమస్య తీవ్రతని బట్టి వైద్యుల సలహా మేరకు మందులు వాడాల్సి రావొచ్చు.


డ్రై ఫ్రూట్స్‌ను పాలలో నానబెట్టి, మిల్క్‌షేక్‌లా తీసుకొంటే బరువు పెరుగుతారా?

- మెహెర్‌, వైజాగ్‌

బరువు పెరగాలంటే శరీరానికి అవసరమైన దానికంటే అధిక శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ అంటే అందులో బాదం, కాజు, ఆక్రోట్‌, పిస్తా లాంటి వివిధ రకాల నట్స్‌, ఖర్జూరాలు, అంజీర్‌, ఎండు ద్రాక్ష లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అధిక క్యాలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి మోతాదుకు మించి తీసుకొంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వీటన్నింటిని మిల్క్‌ షేక్‌లా కాకపోయినా, విడిగా తీసుకొన్నా సరే బరువు పెరిగేందుకు సరిపడా తీసుకొంటే ఉపయోగం ఉంటుంది. అయితే నానబెట్టి షేక్‌ లా తీసుకుంటే తాగేందుకు తేలికగా ఉండడం వల్ల చాలామంది ఇష్టపడతారు. బరువు తగ్గడం లేదా పెరగడం అనేది ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అన్న దానికంటే కూడా ఏ మోతాదులో, ఏ పరిమాణంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com


నాకు నలభై ఏళ్ళు. కాళ్ళ బొటన వేళ్ళు కీళ్ల వద్ద నొప్పులు ఉంటున్నాయి. రక్త పరీక్షల్లో యూరిక్‌ యాసిడ్‌ అధికంగా ఉందని తేలింది. ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

- కరీముద్దీన్‌, హైదరాబాద్‌

రక్తంలో యూరిక్‌ ఆసిడ్‌ ఎక్కువ ఉండడాన్ని ‘హైపర్‌ యూరిసీమియా’ అంటారు. మనం తీసుకునే ఆహారం, శరీరంలో జరిగే రకరకాల జీవప్రక్రియల ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే ప్యూరీన్లు అనే పదార్థాలు యూరిక్‌ యాసిడ్‌ గా మారతాయి. ఈ యూరిక్‌ యాసిడ్‌ నే వ్యర్థ పదార్థంగా కిడ్నీలు యూరిన్‌ లేదా మూత్రం రూపంలో విసర్జిస్తాయి. యూరిక్‌ యాసిడ్‌ విసర్జన సరిగా లేనపుడు రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ పెరిగి అవి క్రిస్టల్స్‌ గా మారే అవకాశం ఉంది. యూరిక్‌ యాసిడ్‌ అధికంగా ఉన్నప్పుడు కొంత మందిలో గౌట్‌ అనే వ్యాధి వస్తుంది. కొన్ని సార్లు కిడ్నీల్లో యూరిక్‌ యాసిడ్‌ రాళ్లు చేరే అవకాశం

ఉంది. యూరిక్‌ యాసిడ్‌ తగ్గించుకోవాలంటే ప్యూరీన్స్‌ అధికంగా ఉండే మాంసాహారం, చేపలు, ఆల్కహాల్‌ లాంటివి పూర్తిగా మానేయాలి. నీళ్లు తగినంత తీసుకోవడం, వాపు తగ్గ్గించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల యూరిక్‌ యాసిడ్‌ నియంత్రణలో ఉంచుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు రోజూ తీసుకోవాలి. ప్రొటీన్‌ కోసం మాంసాహారం బదులుగా గుడ్లు, పప్పు ధాన్యాలు, పాలు, పెరుగు, పనీర్‌ వంటివి తీసుకోవచ్చు. సమస్య తీవ్రతని బట్టి వైద్యుల సలహా మేరకు మందులు వాడాల్సి రావొచ్చు.

Updated Date - Sep 01 , 2024 | 10:28 AM

Advertising
Advertising