ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఏ తండ్రికైనా ఇంతకు మించి ఏం కావాలి? సరిగ్గా రిటైర్మెంట్ రోజున..

ABN, Publish Date - May 14 , 2024 | 06:46 PM

రిటైర్మెంట్ రోజును ఓ వ్యక్తికి మరెవరికీ దక్కని అదృష్టం దక్కింది. తన కొడుకుతో కలిసి రిటైర్మెంట్ రోజున విధుల్లో పాల్గొనే అవకాశం చిక్కింది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

Man joins as co pilot on fathers last flight before retirement

ఇంటర్నెట్ డెస్క్: రిటైర్మెంట్ రోజును ఓ వ్యక్తికి మరెవరికీ దక్కని అదృష్టం దక్కింది. తన కొడుకుతో కలిసి రిటైర్మెంట్ రోజున విధుల్లో పాల్గొనే అవకాశం చిక్కింది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది (Viral).

అమెరికాకు చెందిన టామ్ లేక్ గత మూడు దశాబ్దాలుగా విమాన పైలట్‌గా ఉన్నారు. ఆయన కుమారుడు ఎరిక్ లేక్ కూడా పైలట్‌యే. గత రెండేళ్లుగా ఇద్దరూ పైలట్-కోపైలట్‌గా విమానాలు నడిపారు. టామ్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించారు. రిటైర్మెంట్ రోజున ఆయన మిషిగన్ నుంచి అట్లాంటాకు తన కొడుకుతో కలిసి విమానం నడిపారు. అట్లాంటాలో దిగగానే తన రాజీమానాను ప్రకటించారు (For His Final Flight Before Retirement Man Joins Father As Co Pilot).

Viral: మనిషి రక్తానికి రెండు చుక్కల పాము విషం కలపగానే.. షాకింగ్ వీడియో!


కొడుకుతో కలిసి రిటైర్మెంట్ రోజున విధుల్లో పాల్గొనడం తన జీవితాంతం గుర్తుండిపోతుందని తెలిపారు. కొడుకు ప్రయోజకుడవడం కళ్లారా చూడటం కంటే మించిన అదృష్టం ఏ తండ్రికీ ఉండదని కూడా చెప్పుకొచ్చాడు. రిటైర్మెంట్ రోజున తండ్రితో కలిసి ప్రయాణించడంపై ఎరిక్ కూడా హర్షం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇదో మధుర స్మృతిగా మిగిలిపోతుందన్నారు.

మరోవైపు ఈ ఉదంతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. వారిది చక్కని కుటుంబమని అనేక మంది కామెంట్ చేశాడు. రిటైర్మె్ంట్ రోజున కొడుకుతో కలిసి విధుల్లో పాల్గొనడం చాలా కొద్ది మందికి మాత్రమే దక్కే అదృష్టమని పేర్కొన్నారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ ఉదంతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - May 14 , 2024 | 06:57 PM

Advertising
Advertising