Elon Musk: అమెరికా టు ఢిల్లీ.. కేవలం 30 నిమిషాలు.. ఎలన్ మస్క్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే..
ABN, Publish Date - Nov 18 , 2024 | 07:16 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన ఎలన్ మస్క్ తను అనుకున్న విధంగానే ట్రంప్‌ను గెలిపించారు. ఇక, ఇప్పుడు ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇటీవల మస్క్ తన వ్యాఖ్యల ద్వారా ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశారు. ప్రజలు అంతకు ముందు ఊహించని ఎలక్ట్రిక్ కార్లు, ఆటో పైలెట్ మోడ్ కార్లతో సంచలనం సృష్టించారు. ఇక, ఆయన సంస్థ స్పేస్ ఎక్స్ (SpaceX) అంతరిక్ష పరిశోధనల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. మొన్నటి వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన మస్క్ తను అనుకున్న విధంగానే ట్రంప్‌ను గెలిపించారు. ఇక, ఇప్పుడు ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇటీవల మస్క్ తన వ్యాఖ్యల ద్వారా ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు (Viral News).
ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్లాలంటే ఇంచుమించుగా 16 గంటలు పడుతోంది. అయితే మస్క్ ప్రయోగం విజయవంతమైతే కేవలం 30 నిమిషాల్లో అమెరికా నుంచి ఇండియాకు చేరుకోవచ్చట. స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేయనున్నారట. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో విప్లవాత్మక సాంకేతికతను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు మస్క్ తెలిపారు. ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ సృష్టించిన స్టార్ షిప్ రాకెట్ సహాయంతో కేవలం 30 నిమిషాల్లో ఎన్ని వేల కిలోమీటర్లు అయినా ప్రయాణం చేయవచ్చట. మస్క్ చేసిన ఈ ప్రకటన ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ప్రయాణికులు రాకెట్ ఎక్కి జెట్ స్పీడ్‌తో ఒక్కసారిగా భూకక్ష్య సరిహద్దులను దాటుతారు. అక్కడి నుంచి అంతే వేగంగా భూమిపై ఉన్న తమ గమ్యస్థానం వైపునకు దూసుకెళ్తారు. ఇలా ప్రయాణం చేయడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం సరిపోతుందట. స్టార్ షిప్ రాకెట్ ఒకేసారి వెయ్యి మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదట. వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా.. మస్క్ ప్రకటన చూస్తే మాత్రం ఇది సాధ్యం కాబోతోందనే చాలా మంది నమ్ముతున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్‌పై మస్క్ కంపెనీ పదేళ్ల క్రితమే ఓ ప్రకటన చేసింది. అప్పట్నుంచి ఆ ప్రాజెక్ట్‌పై పరిశోధనలు సాగిస్తూ వస్తున్నారట. ఒకవేళ ఇది సాధ్యమైతే గనుక ఏ దేశానికైనా కేవలం అరగంటలో వెళ్లిపోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Viral Video: తప్పక చూడాల్సిన వీడియో.. మంచు మీద లావా ప్రవహిస్తుంటే ఎలా ఉందో చూడండి..
Viral Video: ఇదేందయ్యా ఇదీ.. నిజమా? మాయా?.. కీ బోర్డ్‌తో కారును ఎలా కంట్రోల్ చేస్తున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 18 , 2024 | 07:16 AM