ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: రైల్వే ఉద్యోగానికి రాజీనామా.. స్పేస్‌ఎక్స్‌లో జాబ్! టాలెంట్ అంటే ఇదీ!

ABN, Publish Date - Oct 15 , 2024 | 06:30 PM

లైఫ్‌లో ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఎదగడమనే తీరుకు అసలైన ఉదాహరణగా నిలుస్తున్న ఓ ఐఐటీ పట్టభద్రుడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెకానికల్ ఇంజినీర్ అయిన ఆయన రైల్వేలో ఉద్యోగజీవితం మొదలెట్టి చివరకు స్పేఎక్స్ సంస్థలో కూడా పనిచేసిన వైనం చూసి జనాలు షాకైపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఎదగడమనే తీరుకు అసలైన ఉదాహరణగా నిలుస్తున్న ఓ ఐఐటీ పట్టభద్రుడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెకానికల్ ఇంజినీర్ అయిన ఆయన రైల్వేలో ఉద్యోగజీవితం మొదలెట్టి చివరకు స్పేఎక్స్ సంస్థలో కూడా పనిచేసిన వైనం చూసి జనాలు షాకైపోతున్నారు. ఆయన ప్రొఫైల్ ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా మారింది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: ఇలాంటి కోడలు దొరకాలంటే పెట్టిపుట్టాలి.. ఈ వృద్ధ జంట నిజంగా లక్కీ!


సంజీవ్ శర్మ అనే వ్యక్తి ఐఐటీ రూర్కీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. ఆ తరువాత రైల్వే శాఖలో డివిజనల్ మెకానికల్ ఇంజినీర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత నాలుగేళ్లకు 1994లో డిప్యుటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందారు. దాదాపు 11 ఏళ్ల పాటు రైల్వేలో పనిచేసిన ఆయన చివరకు రాజీనామా చేసి ఉన్నత చదువులవైపు మళ్లారు. 2002లో ఆయన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌కు సంబంధించి ఎమ్‌ఎస్ కోర్సులో చేరారు. అనంతరం, 2003లో సీగేట్ టెక్నాలజీ సంస్థలో స్టాఫ్ మెకానికల్ ఇంజినీర్‌గా చేరారు.

Viral: గ్రహాంతరవాసులు ఉన్నారు! త్వరలో శాస్త్రవేత్తల కీలక ప్రకటన!!


మరో ఐదేళ్లకు అక్కడే సీనియర్ మెకానికల్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందారు. 2013లో ఆ సంస్థను వీడారు. ఆ ఉద్యోగం చేస్తుండగానే ఆయన మేనేజ్‌మెంట్ టెక్నాలజీలో ఎమ్‌ఎస్ కూడా చేశారు. ఆ తరువాత స్పేస్ ఎక్స్ సంస్థలో డైనమిక్స్ ఇంజినీర్‌గా చేరారు. ఎయిరోడైనమిక్స్, జీఎస్‌సీ, ప్రొపల్షన్, థర్మల్ ఇంజినీరింగ్ వంటి వివిధ విభాగాలతో కలిసి పలు ప్రాజెక్టులపై పనిచేశారు. ఫాల్కన్ 9 రాకెట్‌కు సంబంధించి ఫ్లైట్ ఫీ9-005 నుంచి ఫ్లైట్ ఫీ9-0059 వరకూ పలు ప్రయోగాలకు ఆయన పనిచేశారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు అవమానం! జాతీయపతాకాన్ని రూపొందించమని అడగడంతో..


ఆ తరువాత స్పేస్ ఎక్స్‌ను వీడిన శర్మ 2018లో కమర్షియల్ డ్రోన్ డెలివరీ సంస్థ మాటర్‌నెట్ ఐఎన్‌సీ సంస్థలో లీడ్ డెవలపర్‌గా చేరారు. వెహికిల్ ఇంజినీరింగ్ విభాగానికి, ఆ తరువాత టెక్నాలజీ డివిజన్‌కు నేతృత్వం వహించారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన అనంతరం 2022లో మళ్లీ స్పేస్ ఎక్స్‌లో చేరారు. స్టార్ షిప్ డైనమిక్స్‌కు సంబంధించి ప్రిన్సిపల్ ఇంజినీర్‌గా ఉన్న శర్మ ప్రస్తుతం కాలిఫోర్నియాలోని హాథోర్న్‌లో ఉంటున్నారు. వృత్తి జీవితంలో ఆయన ఇలా అంచలంచెలుగా ఎదిగిన తీరు చూసి జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జర్నీ స్ఫూర్తిమంతమని కామెంట్ చేస్తున్నారు.

Viral: కోడి ముందా? గుడ్డు ముందా? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే..

Read Latest and Viral News

Updated Date - Oct 15 , 2024 | 06:43 PM