ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: మార్కెట్‌లో జర్మనీ యువతి వీడియో.. వైరల్

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:59 PM

దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న సరే స్థానిక భాష నేర్చుకోవాలి. ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇంట్రెస్ట్ చూపించరు. జర్మనీకి చెందిన జెన్నీఫర్ మాత్రం కన్నడ నేర్చుకుంది. కన్నడలో మాట్లాడుతూ ఓ వీడియో కూడా తీసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

German Woman Speaks Kannada

బెంగళూర్: తమిళనాడు, కర్ణాటకలో ప్రాంతీయ అభిమానం కాస్త ఎక్కువ. భాష మీద పట్టింపు ఎక్కువే. బెంగళూరులో కన్నడ రాజ్యోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తారు. బెంగళూర్‌లో ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రావడంతో, తమ ఉనికి ఎక్కడ కోల్పోతామనే భావనలో కన్నడీగులు ఉంటారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న సరే స్థానిక భాష నేర్చుకోవాలి. ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇంట్రెస్ట్ చూపించరు. జర్మనీకి చెందిన జెన్నీఫర్ మాత్రం కన్నడ నేర్చుకుంది. కన్నడలో మాట్లాడుతూ ఓ వీడియో కూడా తీసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.


కన్నడలో మాట్లాడతా..

ఆ వీడియో 2.52 నిమిషాల నిడివి ఉంది. అందులో జెన్నిఫర్ పరిచయం చేసుకుంది. ‘ఈ రోజు కన్నడలో మాట్లాడతాను. ఇంగ్లీష్, హిందీ మాట్లాడాను. మార్కెట్ మొత్తం తిరిగి, ఓ చోట ఆగింది. అక్కడ ఉన్న కన్నడీగులతో కలిసి మాట్లాడింది. అందరూ ఆమెను ప్రశంసించారు. కర్ణాటకలో కన్నడ మాట్లాడటం ఆనందంగా ఉంది అని’ అభిప్రాయ పడ్డారు.


టీచర్‌గా విధులు

జర్మనీకి చెందిన జెన్నిఫర్ కర్ణాటకలో ఉంటున్నారు. ఇక్కడ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆ క్రమంలో జెన్నీఫర్ కన్నడ భాష నేర్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ వచ్చాయి. ‘జర్మనీకి చెందిన యువతి కన్నడ నేర్చుకుంది. దేశంలో ఉన్న మిగతా వారు ఎందుకు కన్నడ నేర్చుకోవడం లేదు. హిందీ ఎందుకు నేర్చుకోరు. కర్ణాటకలో ఉంటూ.. సొంతంగా కన్నడ నేర్చుకుంది. భాష నేర్చుకోవాలని ఎవరూ ఆమెపై ఒత్తిడి తీసుకురాలేదు. ఇతరులు కూడా స్థానిక భాష నేర్చుకోవాలని ఇబ్బంది పెట్టొద్దు అని’ యూజర్ సూచించారు.


షాపుకెళ్లి కన్నడ మాట్లాడి

‘ఒకసారి షాపునకు వెళ్లా. వచ్చిరానీ కన్నడ భాషలో మాట్లాడా. ఆ మాటలను ఇడ్లీ షాపు వ్యక్తి, ఇతరులు గుర్తించారు. పక్కన ఉన్న కొందరు వచ్చి నన్ను అభినందించారు. ఆ రోజు నేను మాట్లాడేందుకు ప్రయత్నం చేశాను. చక్కగా మాట్లాడాలని ఉత్సాహ పరిచారు. అలాగే నాకు సరైన గౌరవం దక్కింది. బెంగళూరులో ఉంటే కన్నడ నేర్చుకోవాలి.. మహారాష్ట్రలో ఉంటే హిందీ కూడా నేర్చుకోవాలి అని‘ మరొకరు సూచించారు.


రాష్ట్రానికో భాష

‘దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం ప్రత్యేక భాష కలిగి ఉంది. కెరీర్ పరంగా ఓకే వ్యక్తి పలు రాష్ట్రాల్లో తిరగాల్సి వస్తోంది. అలాంటి సమయంలో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన భాష నేర్చుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఓ అధికార భాష, జాతీయ భాషను తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించాలి అని’ మరో యూజర్ సూచించారు. ఇతని సూచన కూడా సరైంది. దేశంలో ఉన్న అన్ని భాషలు నేర్చుకోవడం అంటే కష్టమేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 10 , 2024 | 04:05 PM

Advertising
Advertising