Viral: నిద్రిస్తున్న కొడుకు పక్కన వింత ఆకారం! అదేంటో గుర్తించిన తండ్రికి..
ABN, Publish Date - May 14 , 2024 | 04:45 PM
నిద్రిస్తున్న తన కొడుకు పక్కన ఓ వింత ఆకారం నిలబడట్టున్న ఫొటో చూసి ఓ తండ్రికి భారీ షాక్ తగిలింది. నెలక్రితం చనిపోయిన తండ్రే తన మనవడిని చూసేందుకు వచ్చాడేమో అంటూ నెట్టింట అతడు సందేహం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: మనిషి మరణించాక అతడి ఆత్మ కొన్ని రోజుల పాటు భూమ్మీదే సంచరిస్తుందని, అయిన వాళ్ల మధ్యే ఉంటుందని కొందరు చెబుతుంటారు. ఇదంతా అవాస్తవమని సైన్స్ చెబుతుంటుంది. కానీ, ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయని చెప్పే కొన్ని వింత ఘటనలు అప్పడప్పుడూ బయటపడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అలాంటి ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది.
జాన్ కప్కీ అనే వ్యక్తి మిషిగన్‌లోని తన వందేళ్ల నాటి భవనంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇటీవలే ఆయన ఇంట్లో ఓ షాకింగ్ దృశ్యం వెలుగు చూసింది. ఓ గదిలో నిద్రిస్తున్న తన కొడుకు పక్కన ఓ వింతఆకారం ఉన్న విషయం గదిలోని కెమెరాలో చిక్కింది. ఆ ఫొటో చూసి మొదట జాన్‌కు ఏమీ అర్థం కాలేదు. కాస్తంత పరిశీలనగా చూస్తే ఆ ఆకారం టోపీ పెట్టుకున్న వ్యక్తిలా కనిపించింది. దీంతో, అతడు ఒక్కసారిగా షాకైపోయాడు (Ghostly Figure Captured Staring At Sleeping Child A Month After Death In Family ).
Viral: మనిషి రక్తానికి రెండు చుక్కల పాము విషం కలపగానే.. షాకింగ్ వీడియో!
బాలుడి తాత సరిగ్గా నెల రోజుల క్రితమే మరణించాడు. ఆయన కూడా టోపీ పెట్టుకునే వాడు. ఈ నేపథ్యంలో టోపీ పెట్టుకున్న మనిషి రూపంలోని వింత ఆకారం నిద్రిస్తున్న కొడుకు పక్కన ఉండటం జాన్‌ను ఒకింత కలవరానికి గురి చేసింది. తన తండ్రి మరణం తరువాత ఇంట్లో ఆత్మల సంచారం ఉన్నట్టు తనకు అనిపించలేదని, కానీ కొడుకు పక్కన వింత ఆకారం చూశాక అనేక సందేహాలు కలుగుతున్నాయని జాన్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఆ ఫొటోను కూడా షేర్ చేశారు.
దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆత్మలు ఉన్నాయని వాదించారు. పోయినవారి ఆత్మలు తమ బంధువులను చూసేందుకు తహతహలాడతాయని చెప్పుకొచ్చారు. కొందరు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేశారు. ఫొటోలోని వింత ఆకారం వెనక మరేదో కారణం ఉండే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - May 14 , 2024 | 04:51 PM