Viral Video: తన పవర్ ఏంటో చూపించిన జిరాఫీ.. సింహం నోటికి చిక్కిన మరో జిరాఫీని ఎలా కాపాడిందో చూస్తే..
ABN, Publish Date - Mar 08 , 2024 | 09:47 PM
అడవి జంతువుల మధ్య కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వేటకు వెళ్లిన పులి.. చిన్న జంతువుల చేతిలో ఘోరంగా ఓడిపోవడం, తీరా నోటికి చిక్కిన ఆహారం కూడా చేజారిపోవడం తదితర ఘటనలు అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. తాజాగా, ఈ తరహా...
అడవి జంతువుల మధ్య కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వేటకు వెళ్లిన పులి.. చిన్న జంతువుల చేతిలో ఘోరంగా ఓడిపోవడం, తీరా నోటికి చిక్కిన ఆహారం కూడా చేజారిపోవడం తదితర ఘటనలు అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ జిరాఫీ.. సింహానికి తన పవర్ ఏంటో చూపించింది. సింహం నోటికి చిక్కిన మరో జిరాఫీని ఎలా కాపాడిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో పర్యటిస్తున్న పర్యాటకులకు షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. ఓ సింహం జిరాఫీపై దాడి (Lion attack on giraffe) చేస్తుంది. దాని మెడ పట్టుకుని పక్కకు లాక్కెళ్తుంది. అయితే దీన్ని గమనించిన మరో జిరాఫీ వెంటనే రంగంలోకి దిగుతుంది. సింహం వద్దకు వెళ్లి.. ‘‘నా స్నేహితుడిని వదిలేయ్’’.. అంటూ ఎదురుగా వెళ్తుంది. సింహం ఆ జిరాఫీని పట్టుకుని మరో వైపునకు వెళ్లాలని చూస్తుంది.
ఈ క్రమంలో జిరాఫీ మధ్యలోకి వెళ్లి సింహాన్ని ఒక్క తోపు తోస్తుంది. ఇలా పలుమార్లు సింహాన్ని బలంగా నెట్టేయడంతో దాన్ని వదిలేస్తుంది. వదిలేయగానే వెంటనే కింపడిన జిరాఫీకి అడ్డుగా నిలబడి, తర్వాత అక్కడి నుంచి పారిపోతాయి. సింహం చేతిలో ప్రాణాలు కోల్పోతున్న జిరాఫీని నిముషాల వ్యవధిలో కాపాడిన పెద్ద జిరాఫీని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Updated Date - Mar 08 , 2024 | 09:47 PM