Viral: ట్రాఫిక్‌లో జాంలో ఇరుక్కున్నప్పుడు ఈ పొరపాటు మాత్రం చేయొద్దు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో!
ABN, Publish Date - May 04 , 2024 | 08:40 PM
ట్రాఫిక్ జాం నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి ట్రక్కు బ్లైండ్ స్పాట్‌లో వెళ్లింది. అదే సమయంలో ట్రక్కు కదలడంతో ఆమె దాని కింద పడినా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మహానగరాలు అన్నాక ట్రాఫిక్ జాం అత్యంత సాధారణ విషయం. కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడ్డప్పుడో లేదా ట్రాఫిక్ జాం అయినప్పుడో కొందరు బైకర్లు, స్కూటీలు నడిపేవాళ్లు తొందర పడుతుంటారు. వాహనాల మధ్య ఉన్న చిన్న చిన్న గ్యాంపుల్లోంచి బళ్లు నడుపుతూ ట్రాఫిక్ రద్దీ నుంచి బయటపడ్డాం అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి పనులతో ఎంతటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: వామ్మో.. దేశముదురు! ఇలాంటోళ్లే ఈ రోజుల్లో జాబ్ కొట్టేది.. అభ్యర్థి తెలివికి బాస్‌కు షాక్!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, చిన్న స్కూటీపై ప్రయాణిస్తున్న యువతి ట్రాఫిక్ జాం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇష్టారీతిన డ్రైవ్ చేసింది. ఓ భారీ ట్రక్కు, కారు మధ్యలో సందులోంచి తన స్కూటీని పోనిచ్చేందుకు ట్రై చేసింది. ఈ క్రమంలో ట్రక్కు ముందు బ్లైండ్ స్పాట్ మీదుగా ఆమె స్కూటీని తోలడంతో ట్రక్కు డ్రైవర్‌కు తన ముందున్న స్కూటీ కనబడలేదు. ఇంతలో ముందున్న కారు కదలడంతో ట్రక్కు కూడా కదిలింది. ఈ క్రమంలో యువతి తన స్కూటీతో సహా ట్రక్కు కింద పడింది (Girl in the blindspot of the truck fell under it has a narrow escape).
అయితే, యువతి అదృష్టం కొద్దీ ట్రక్కు చక్రాల కింద ఆమె పడకపోవడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. ట్రక్కు వెళ్లిపోయాక ఆమె లేవగలిగింది. పక్క లేన్‌లో ఉన్న కారులోని వాళ్లు ఇదంతా రికార్డు చేయడంతో ఆ వీడియో నెట్టింట బాట పట్టి సంచలనంగా మారింది. ఘటన ఎక్కడ జరిగిందీ తెలియకపోయినా జనాలు మాత్రం యువతి ఎదుర్కొన్న భయానక పరిస్థితి చూసి షాకైపోతున్నారు. భారీ వాహనాలకు దగ్గరగా ప్రయాణించకూడదని పలువులు సూచించారు. వాహనాల బ్లైండ్ స్పాట్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Updated Date - May 04 , 2024 | 08:46 PM