Viral: లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో ఈమెను చూసి నేర్చుకోవాలి! వీడియో వైరల్!
ABN, Publish Date - Sep 28 , 2024 | 06:14 PM
ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన ఓ యువతి బోర్ కొట్టకుండా ఉండేందుకు అక్కడున్న ఓ పెళ్లి ఊరేగింపుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న తీరు జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఆధునిక జమానాలో దాదాపుగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒత్తిడి పెరిగిపోతోంది. చిరాకులు పరాకులు ఎక్కువవుతున్నాయి. నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని చిరాకు పడేవాళ్లు, చివరకు అవతలి వారి మీద కోపం ప్రదర్శించే వాళ్లు కోకొల్లలు. కానీ ఓ యువతి ట్రాఫిక్ జామ్‌ను కూడా సద్వినియోగం చేసుకుంది. ఆ కాసేపట్లోనే ఫుల్లుగా ఎంజాయ్ చేసి జీవితం మొత్తానికి సరిపడా మధుర స్మృతులు పోగేసుకుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతున్న ఈ వీడియో పూర్తి వివరాల్లోకి వెళితే..
Viral: చైనాలో పేలిన మురుగునీటి పైపు! జనాల ఒళ్లంతా మానవవ్యర్థాలు పడి..
బెంగళూరులో ఈ ఘటన జరిగింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, నగరంలో ఓ చోట ఎప్పటిలాగే భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, ఆటోలో ఉన్న ఓ యువతి కూడా అక్కడే చిక్కుకుపోయింది. కానీ ఆమె అందరిలా చిరాకు పడలేదు. ఏదో కోల్పోయినట్టు ముఖం పెట్టుకుని కూర్చోలేదు. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె అటువైపు వెళుతున్న పెళ్లి ఊరేగింపులో చేరిపోయి తెగ డ్యాన్స్ చేసింది.
Viral: పాప్యులర్ ఇన్‌ఫ్లుయెన్స్‌ర్‌కు యువతి షాక్! ఫోటో దిగుదామని చెప్పి..
మొదట పెళ్లి ఊరేగింపును గుర్తించగానే ఆమెకు తళ్లుక్కున ఐడియా తట్టింది. దీంతో, ముఖమంతా సంతోషం వెల్లివిరుస్తుండగా ఆటో దిగిన ఆమె ఊరేగింపు వద్దకు వెళ్లి అక్కడున్న వారితో కలిసి చిందేసింది. అపరిచిత యువతి తమతో పాటు డ్యాన్స్ చేయడంతో యువత కూడా రెచ్చిపోయారు. ఆమెతో పాటు కేరింతలు కొడుతూ కొత్త ఉత్సాహంతో డ్యాన్స్ చేశారు.
Viral: ఆఫీసులో అలసిపోయి వచ్చిన భార్య కోసం వంట వండని భర్త! చివరకు..
ఇక వీడియో వైరల్ కావడంతో యువతిపై నెట్టింట ప్రశంసలు కురిశాయి. రకరకాల కామెంట్స్‌తో జనాలు ఆమెను ఆకాశానికెత్తేశారు. ఆమె ఎంట్రీ ఇవ్వగానే ఆ ఊరేగింపులో కొత్త జోష్ వచ్చిందని కొందరు అన్నారు. లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో ఎవరైనా ఈమెను చూసి నేర్చుకోవాలని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఆమె కాన్ఫిడెన్స్ కూడా అద్భుతమని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Viral: వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!
కాగా, ఓనమ్ పండగ సందర్భంగా పిల్లలు వేసిన పూల ముగ్గును కాళ్లతో తొక్కి నాశనం చేసిన ఓ బెంగళూరు మహిళపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ముగ్గును ఆమె కసిగా నాశనం చేస్తున్న వీడియో వైరల్ కావడంతో నెట్టింట జనాగ్రహం వెల్లువెత్తింది. అపార్ట్‌మెంట్ కామన్ ఏరియాలో ముగ్గు ఎందుకు వేశారంటూ తగు పెట్టుకున్న ఆమె చివరకు ఇలా ముగ్గును నాశనం చేసింది. ఇది వివాదాస్పదం కావడంతో చివరకు కేసు నమోదైంది.
Viral: షాకింగ్..నవజాత శిశువుతో పాలసీసా శుభ్రం చేయించిన వైనం!
Updated Date - Sep 28 , 2024 | 06:14 PM