Viral News: పెళ్లి చేసుకోరు.. కానీ భర్త మాత్రం ఉంటాడు.. ఆ దేశంలో వింత సంస్కృతి..
ABN, Publish Date - Dec 07 , 2024 | 05:20 PM
వియత్నాం దేశంలో ప్రస్తుతం వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెళ్లి చేసుకునేందుకు ఆ దేశపు అమ్మాయిలు సిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణం. వివాహం తర్వాత కెరీర్‌ను కొనసాగించలేమని అక్కడి యువతులు భావిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వివిధ సంప్రదాయాలు పాటిస్తుంటాయి. స్థానికంగా ఉండే వారివారి సంప్రదాయాల ప్రకారం వివాహాలు ఘనంగా చేస్తుంటారు. అయితే ప్రస్తుతం పలు దేశాల్లో యువతకు పెళ్లిపై ఆసక్తి తగ్గుతోంది. ఆర్థిక, ఉద్యోగ సమస్యలు.. ఆడ, మగ మధ్య స్వేచ్ఛ పెరిగిపోయి పెళ్లి తర్వాత భేదాభిప్రాయాలు రావడం తదితర కారణాలతో పెళ్లి అంటేనే బాబోయ్ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తల్లిదండ్రులు మాత్రం పిల్లలకు పెళ్లి చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. పిల్లలు పెళ్లి చేసుకోమని తేగేసి చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే దీన్ని నివారించేందుకు దక్షిణాసియా దేశం వియత్నాం అమ్మాయిలు కొత్త ట్రెండ్ మెుదలుపెట్టారు. సర్రోగేట్ బాయ్ ఫ్రెండ్ అని కొత్త పద్ధతిని పాటిస్తూ వారి కుటుంబాన్ని సంతోష పెడుతున్నారు.
అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ ఎందుకంటే?
వియత్నాం దేశంలో ప్రస్తుతం వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెళ్లి చేసుకునేందుకు ఆ దేశపు అమ్మాయిలు సిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణం. వివాహం తర్వాత కెరీర్‌ను కొనసాగించలేమని అక్కడి యువతులు భావిస్తున్నారు. భర్త, పిల్లలతో నాలుగు గోడల మధ్యే గడపాల్సి వస్తుందనే భయం వారిలో పెరుగుతోంది. అంతేకాకుండా పెళ్లి తర్వాత కుటుంబంలో తలెత్తే సమస్యలు బాగా పెరుగుతున్నాయని నమ్ముతున్నారు.
సాధారణంగా వియత్నాం సంప్రదాయంలో నూతన సంవత్సరం వేళ అమ్మాయిలు వివాహం చేసుకుని భర్తతో సహా తల్లిదండ్రుల ఇంటికి రావాలి. కానీ పెళ్లి చేసుకుంటే తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల పట్ల భర్త వైఖరి తక్కువగా ఉంటుందని యువతులు నమ్ముతున్నారు. దీంతో వివాహం చేసుకునేందుకు నో చెప్తున్నారు. అందుకే ఈ సమస్యలన్నింటి నుంచి తప్పించుకోవడానికి వియత్నాం అమ్మాయిలు పెళ్లి బంధంలోకి రాకుండా సర్రోగేట్ బాయ్‌ఫ్రెండ్ అనే కాన్సెప్ట్‌ని ఎంచుకుంటున్నారు.
ఇద్దెక్కడి సంస్కృతి..
సర్రోగేట్ బాయ్‌ఫ్రెండ్ అంటే అద్దె బాయ్ ఫ్రెండ్ అని అర్థం. ఇక్కడ పెళ్లికి సిద్ధంగా లేని యువతులు అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌ని తెచ్చుకుంటున్నారు. అలా రెంట్‌కు వచ్చిన యువకులు చాలా పనులే చేయాల్సి ఉంటుంది. అమ్మాయిల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు వారు వంట చేయాల్సి ఉంటుంది. అలాగే యువతుల తల్లిదండ్రులను సంతోషపెట్టడం దగ్గర్నుంచీ పని పనీ చేయాల్సి ఉంటుంది. పార్టీలు, ఇతర కార్యక్రమాలకు సైతం వీరిని తీసుకువెళ్తుంటారు అమ్మాయిలు. అయితే ఇక్కడ రెంట్‌కు అబ్బాయిలే కాదు.. అమ్మాయిలూ దొరుకుతారు. విచిత్రం ఏంటంటే యువతులను అద్దెకు తీసుకునే దాని కంటే.. అబ్బాయిలను అద్దెకు తీసుకునే అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అలాగే రెంట్‌కు వచ్చిన యువతీ, యువకులు చాలా అందంగా ఉండడం విశేషం. అలా అద్దెకు వచ్చి వారు భారీగానే డిమాండ్ చేస్తారట. దీంతో వారి ఆదాయం ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. మన దేశంలో ఇలాంటి సంప్రదాయం లేదు. కానీ కాల్ బాయ్స్, కాల్ గర్ల్స్ వంటి రూపాల్లో ఇలాంటి వారు దర్శనం ఇస్తుంటారు.
Updated Date - Dec 07 , 2024 | 05:20 PM