Viral News: బీర్ తాగిన బాలికలు.. ఎక్కడంటే..
ABN, Publish Date - Sep 10 , 2024 | 05:25 PM
స్కూల్ ఆవరణలో విద్యార్థినిలు ఉన్నారు. వారి చేతుల్లో బీర్ బాటిళ్లు ఉన్నాయి. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కొన్ని స్కూళ్లు విద్యా ప్రమాణాలను పాటించడం లేదు. మంచి, చెడు చెప్పడం లేదు. క్రమశిక్షణ సంగతి దేవుడెరుగు. టీచర్లు అంటే విద్యార్థులు భయపడే రోజులు పోయాయి. స్కూల్ ఆవరణలో మందేసి చిందేస్తోన్నారు. ఛత్తీస్ ఘడ్‌లో (Chhattisgarh) జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
చేతిలో బీర్ బాటిళ్లు
స్కూల్ ఆవరణలో విద్యార్థినిలు ఉన్నారు. వారి చేతుల్లో బీర్ బాటిళ్లు ఉన్నాయి. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆలస్యంగా వెలుగులోకి..
బిలాస్ పూర్ జిల్లాలో గల భాత్‌చౌరా గ్రామంలో జూలై 29వ తేదీన ఘటన జరిగింది. ఉన్నత పాఠశాల పరిసరాల్లో కొందరు విద్యార్థినిలు బీర్లు, కూల్ డ్రింక్స్ తాగారు. ఘటనపై ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని డీఈవో టీఆర్ సాహు వివరించారు. ఆ కమిటీ టీచర్లు, విద్యార్థినీలను ప్రశ్నించిందని పేర్కొన్నారు. ఏదో సరదా కోసం బీర్ బాటిళ్లను లేపి ఫొటోలు దిగామని కొందరు విద్యార్థినిలు వివరించారు. మద్యం సేవించలేదని స్పష్టం చేశారు. జరిగిన ఘటనపై డీఈవో సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కావొద్దని సూచించారు. ప్రిన్సిపల్, ఇతరులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మద్యం సేవించిన విద్యార్థినీల పేరంట్స్‌కు నోటీసులు అందజేస్తామని వివరించారు.
బర్త్ డే ఉండటంతో..
ఆ రోజున క్లాస్ మేట్ బర్త్ డేను జరుపుకున్నారని తెలిసింది. ఆ పార్టీలో బాలికలు మద్యం సేవించారని సమాచారం. పార్టీకి హాజరైన ఓ విద్యార్థి ఫొటోలు, వీడియోలను షేర్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఘటనపై అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు.
మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Sep 10 , 2024 | 05:25 PM