మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Google Pune Office: గూగుల్‌లో జాబ్ కోసం ఎగబడేది ఇందుకే.. ఒక్కసారి వాళ్ల ఆఫీసుకు వెళితే..

ABN, Publish Date - Feb 19 , 2024 | 05:25 PM

గూగుల్ ఇటీవలే ప్రారంభించిన పూణె కార్యాలయం వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Google Pune Office: గూగుల్‌లో జాబ్ కోసం ఎగబడేది ఇందుకే.. ఒక్కసారి వాళ్ల ఆఫీసుకు వెళితే..

ఇంటర్నెట్ డెస్క్: టెక్ రంగంలోని ఉద్యోగుల జీతాలు, ఒత్తిళ్లు అందరికీ తెలిసిందే. అయితే, ఆయా కంపెనీల్లో ఉద్యోగులకు ఉండే సౌకర్యాల గురించి ప్రచారం కాస్తంత తక్కువ. అందుకే ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. వీడియో చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు. వీడియో షేర్ గూగుల్ ఉద్యోగి అదృష్టం చూసి అసూయగా ఉందని సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Viral: ఓనర్ ఆంటీ నుంచి కుర్రాడికి ఊహించని మెసేజ్..నన్ను కన్నకొడుకులా చూస్తుంది.. ఇప్పుడేం చేయాలంటూ..

గూగుల్‌ సంస్థ ఇటీవలే పూణెలోని కోరేగావ్ పార్క్ ఎనెక్స్‌లో కొత్త కార్యాలయాన్ని (Google Pune Office) ప్రారంభించింది. క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడి కార్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ కార్యాలయాలతో కలిసి పనిచేస్తుంది. అయితే, పూణెలో గూగుల్ ఆఫీసులో పనిచేస్తున్న ఆర్ష్ గోయల్ తమ కొత్త ఆఫీసు ఎలా ఉందో వీడియో రికార్డు చేసి నెట్టింట పంచుకున్నాడు. ఈ వీడియో చూసి జనాలు షేక్ అయిపోతున్నారు.

Viral: లోకంలో నిజమైన ప్రేమే లేదా? గర్ల్‌ఫ్రెండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వచ్చేలా చేస్తే..


ఉద్యోగులకు సకల సౌకర్యాలు ఉన్న ఈ కొత్త ఆఫీసు నెటిజన్లను అమితంగా అకట్టుకుంటోంది. ఉద్యోగులు రిలాక్స్ అయ్యేందుకు, తమకు నచ్చిన గేమ్స్ ఆడుకునేందుకు ఓ గేమింగ్ జోన్, రిక్రియేషన్ రూం, మనసుకు ఉల్లాసం కలిగించేలా ఉన్న కార్యాలయ వాతావరణం, నోరూరించే ఫుడ్స్ ఉన్న కేఫ్ వంటివి (Impressive Interiors) చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

మినరల్ వాటర్ తాగుతారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు

ఇంటికంటే ఆఫీసే బెస్ట్ అనిపించేలా ఉన్న ఈ వాతావరణం జనాలకు విపరీతంగా నచ్చింది. ఇప్పటివరకూ వీడియోకు 4.7 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ ఆఫీసు చూశాక తమకూ గూగుల్‌లో పనిచేయాలనిపిస్తోందని అనేక మంది కామెంట్ చేశారు. గూగుల్‌లో జాబ్స్ కోసం జనాలు ఎగబడేది ఇందుకే అంటూ మరికొందరు కామెంట్ చేశారు.

గూగుల్‌కు ప్రస్తుతం భారత్‌లో ఐదు కార్యాలయాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2024 | 05:33 PM

Advertising
Advertising